Telugu IAS Sanjay Murthy: ‘కాగ్’ చీఫ్ గా తొలి తెలుగు వ్యక్తి సంజయ్‌ మూర్తి.. సంజయ్‌ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ

కాగ్‌ కు అధిపతిగా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

K Sanjay Murthy (Credits: X)

Newdelhi, Nov 19: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) (CAG) చీఫ్ గా తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఐఏఎస్ కొండ్రు సంజయ్‌ మూర్తి (Telugu IAS Sanjay Murthy) నియమితులయ్యారు. కాగ్‌ కు అధిపతిగా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంజయ్ ను 15వ కాగ్‌ గా నియమించినట్టు కేంద్రం వెల్లడించింది. సంజయ్‌ మూర్తి ఏపీలోని అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ సెప్టెంబర్ 2021 నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం, శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసిన టీటీడీ, పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..

ఎవరీ సంజయ్‌ మూర్తి?

సంజయ్‌ మూర్తి 24 డిసెంబర్ 1964లో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్‌ ప్రదేశ్ క్యాడర్‌ కు ఎంపికయ్యారు. సంజయ్ తండ్రి అయిన కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరపున అమలాపురం నుంచి లోక్‌ సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలు అందించారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు