Monday Pooja: సోమవారం ఉపవాసం చేస్తున్నారా, అయితే ఈ తప్పులు అస్సలు చేయవద్దు, లేదంటే పరమశివుడి మహా ఆగ్రహానికి గురవుతారు...

శివుడి కృపతో మీరు చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయని వేదాంతులు చెబుతున్నారు.

Lord Shiva (Photo Credits: Pixabay)

సోమవారం నాడు శివుడిని పూజించడం వలన ఆశించిన ఫలితాలు వస్తాయని విశ్వాసం. శివుడి కృపతో మీరు చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయని వేదాంతులు చెబుతున్నారు. సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆది దేవుడు శివుడిని సోమవారం నాడు కొలుస్తారు భక్తులు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేయడం ద్వారా పరమేశ్వరుడి ఆశీర్వాదాలు పొందుతారు. వీలైతే సోమవారం తెల్లవారుజామున స్నానం చేసిన తరువాత శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని ప్రార్థించండి. ఇంట్లో శివుడి విగ్రహం, ఫోటోకు పూజ చేయండి. సోమవారం నాడు ఉపవాసం ఉండటంతో పాటు.. వస్త్రాలు, ఆహారం దానం చేయడం వల్ల కూడా పరమేశ్వరుడి కరుణ మీపై ఉంటుంది.

సోమవారం ఉపవాసంలో ఈ తప్పు చేయకండి..

>> సోమవారం వ్రతం పాటించే వారు తెల్లని వస్తువులను దానం చేయకూడదు.

>> సోమవారం పూజ చేసే వ్యక్తి కుంకుమ, పసుపు, ఎరుపు రంగు దుస్తులు ధరించవచ్చు.

>> సోమవారం ఉపవాస పూజలో నల్లని వస్త్రాలు ఉపయోగించవద్దు. సోమవారం ఉత్తరం, తూర్పు దిశలో ప్రయాణించ కూడదు.

> రాగి పాత్రలో పాలు పోసి శివుడికి అభిషేకం చేయకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం స్వామి వారికి అయిష్టమట.

>> శివలింగంపై చందనం వేసి అభిషేకించండి. లింగంపై కుంకుమ, పసుపు వేయొద్దు.