Astrology: ఆదివారం రోజున పొరపాటున కూడా ఇటువంటి పనులు చేయకండి ఆర్థిక నష్టాలు వస్తాయి..

ప్రతిరోజు సూర్య భగవాన్ కి నమస్కరించుకోవడం ద్వారా వారి వ్యాపారాలు వారి పనులు వృత్తులు అన్నీ కూడా మంచిగా ఉంటాయని నమ్మకం.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారాన్ని సూర్యదేవుడికి అంకితంగా కోలుస్తూ ఉంటారు. ప్రతిరోజు సూర్య భగవాన్ కి నమస్కరించుకోవడం ద్వారా వారి వ్యాపారాలు వారి పనులు వృత్తులు అన్నీ కూడా మంచిగా ఉంటాయని నమ్మకం. అయితే ఆదివారాల రోజున సూర్యభగవానుడికి చాలా పవిత్రంగా ఉంటుంది. పొరపాటున కూడా ఆదివారం రోజున పనులు చేయకండి. దీనిద్వారా మీ కుటుంబంలో కలహాలు ఆర్థికపరమైన నష్టాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి.

Vastu Tips: బెడ్రూంలో పొరపాటును కూడా ఈ వస్తువులను ఉంచకండి,

ఆదివారం రోజు చేయకూడని పనులు..ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా పశ్చిమ దిశలో ప్రయాణాలు చేయకూడదు దీని ద్వారా మీకు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆదివారం రోజున రాగి పిండితో చేసిన ఏ వంటలను కూడా ఎవరికి దానం చేయకూడదు..

ఆదివారం రోజున నీలం కలర్ నలుపు గోధుమ రంగు గ్రే కలర్ వంటి దుస్తులను ధరించకూడదు దీనివల్ల శని మీ పైన తాండవిస్తుంది.

ఆదివారం రోజున సూర్యభగవానుడికి ఎంతో ప్రీతీ పాత్ర మైనది ఈ రోజున మాంసాహారము మద్యపానానికి దూరంగా ఉండడం మంచిది. దీనివల్ల మీ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి.

ఆదివారం నాడు తల పైన నూనె పెట్టుకోకూడదు అంతేకాకుండా దుకాణాల నుండి నూనెని కొనుగోలు చేయకూడదు.

ఆదివారం రోజు ఇనుముతో చేసిన ఎటువంటి వస్తువులు కూడా కొనకూడదు. దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు. దీనివల్ల ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు కొనసాగుతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.