Astrology: కొత్త సంవత్సరంలో అప్పుల బాధ నుండి విముక్తి పొందాలంటే ఈ పరిహారాలు చేయండి..

ఇంట్లో వాస్తు దోషం ఉంటే మనం ఎంత సంపాదించినా కూడా ఒక్కొక్కసారి కష్టాలపాలు అవుతూ ఉంటాము. ముఖ్యంగా ఈ దోషాల వల్ల కొన్ని సార్లు మన పరిస్థితి దిగజారిపోతుంది.

laxmi devi

జ్యోతిష్య శాస్త్రానికి, వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే మనం ఎంత సంపాదించినా కూడా ఒక్కొక్కసారి కష్టాలపాలు అవుతూ ఉంటాము. ముఖ్యంగా ఈ దోషాల వల్ల కొన్ని సార్లు మన పరిస్థితి దిగజారిపోతుంది. అటువంటి సమయంలో మనము కొన్ని వాస్తు శాస్త్రంలో దోషాలను పోగొట్టుకునేందుకు కొన్ని వాస్తు నివారణ చర్యలను అనుసరించడం ద్వారా ఈ బాధల నుండి బయటపడతాము. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీదేవి విగ్రహాన్ని ఈ దిశలో ఉంచాలి- వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యంగా అప్పుల బాధ ఎక్కువైనట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉత్తరం వైపు ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఎందుకంటే ఉత్తరం వైపున లక్ష్మీదేవి కుబేరుడు ఇద్దరు కూడా ఆ దిశలోనే నివసిస్తారు.

Vastu Tips: పొరపాటున కూడా మీ పర్సులో ఈ 4 వస్తువులు ఉంచవద్దు

ఈరోజు రుణాన్ని చెల్లించాలి- మీరు ఎవరి దగ్గరైనా రుణం తీసుకున్నట్లయితే తిరిగి ఆ రుణాన్ని మంగళవారం రోజున చెల్లించాలి. ఈ రోజున చెల్లిస్తే మీకు త్వరలోనే అప్పుల బాధ నుంచి బయటపడతారు. అంతేకాకుండా మీ ఇంట్లో డబ్బు నివాసం ఉంటుంది.

రావి చెట్టును పూజించండి- మీరు ఆర్థిక ఇబ్బందులతో రుణ బాధలతో బాధపడుతుంటే ప్రతి శనివారం రోజు రావి చెట్టుకి పూజ చేయండి. ఉదయాన్నే తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్లి అక్కడ దీపాన్ని వెలిగించి రావి చుట్టూ చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మీ సమస్యను తొలగించమని ప్రార్థించండి. అప్పుడు అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif