Astrology: మేష రాశి నుండి మీన రాశి వరకు ఏ రాశి వారు ఏ రత్నాన్ని ధరిస్తే వారికి మంచి జరుగుతుంది..

అయితే కొన్నిసార్లు రత్నాన్ని ధరించడం వల్ల పేదవారు కూడా ధనవంతులు అవుతారు. కొన్నిసార్లు రాజు కూడా కటిక దరిద్రంలోకి వెళ్ళిపోతారు.

gems

రత్నాల శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితం పైన ఒక ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే కొన్నిసార్లు రత్నాన్ని ధరించడం వల్ల పేదవారు కూడా ధనవంతులు అవుతారు. కొన్నిసార్లు రాజు కూడా కటిక దరిద్రంలోకి వెళ్ళిపోతారు. అందుకే జ్యోతిష్య శాస్త్రులు వారిని సంప్రదించి వారికి తగిన రత్నాలను ధరించమని చెబుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం పెట్టుకునే రత్నాల వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం బాగా లేకపోవడం ఆర్థికంగా నష్టాలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రత్నాల శాస్త్రం ప్రకారం గ్రహాలు రత్నాలకు మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. 12 రాశుల వారికి వారికి సంబంధించిన రత్నాలను ధరించడం వల్ల వారికి శుభప్రదం జరుగుతుంది. అయితే ఏ రాశి వారు ఏ రత్నాన్ని ధరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మేష రాశి- మేష రాశి వారు గోమేదికం ధరించడం శుభప్రదం.

వృషభ రాశి వారు- వృషభ రాశి వారిని పాలించే గ్రహం శుక్రుడు ఈ రాశి వారికి వజ్రం అదృష్టానికి తీసుకొని వస్తుంది.

Vastu Tips: జస్ట్ మీ ఇంట్లో ఈ మార్పులు చేస్తే చాలు! 

మిథున రాశి- మిధున రాశివుని పాలించే గ్రహం కుజుడు ఈ రాశి వారు పచ్చ రత్నాన్ని ధరించడం మంచిది..

కర్కాటక రాశి- కర్కాటక రాశి వారిని చంద్రుడు పాలించే గ్రహంగా చెప్పవచ్చు ఈ రాశి వారు ముత్యం ఉంగరాన్ని ధరించాలి.

సింహరాశి- సింహ రాశి వారికి విని పాలించే గ్రహం సూర్యుడు ఈ రాశి చెందిన వారు పగడాన్ని ధరించడం మంచిది..

కన్య రాశి- కన్యా రాశిని పాలించే గ్రహం బుధుడు ఈ రాశి వారు నీలం రత్నాన్ని ధరించడం చాలా మంచిది

తులారాశి- తులారాశి పాలించే గ్రహం శుక్రుడు ఈ రాశి వారికి కనకపుష్యరాగం ధరించడం మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది.

వృశ్చిక రాశి- వృశ్చిక రాశిని పాలించే గ్రహం కుజుడు ఈ రాశి వారికి మరకతం రత్నాన్ని ధరించడం చాలా మేలును కలిగిస్తుంది.

ధనస్సు రాశి- ధనస్సు రాశిని పాలించే గ్రహం గురుడు ఈ రాశి వారు కనకపుష్యరాగాన్ని ధరించడం చాలా శుభప్రదం.

మకర రాశి- మకర రాశిలో జన్మించిన వారికి శని గ్రహం వారి పాలించే గ్రహంగా చెప్పవచ్చు ఈ రాశి వారు వైడూర్యం రత్నాన్ని ధరించడం చాలా శుభప్రదం.

కుంభరాశి- కుంభ రాశిలో జన్మించిన వారు కెంపురత్నాన్ని ధరించడం శుభప్రదం.

మీనరాశి- మీనరాశిని పరిపాలించే గ్రహంగా గురుణ్ణి చెప్పవచ్చు ఈ రాశి వారు నీలం రత్నాన్ని ధరించడం ఎంతో శుభప్రదం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.