Astrology: జనవరి 6 బుధ గ్రహం, శని గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 50 నిమిషాలకు బుధుడు శని గ్రహాల కలయిక దీని కారణం గా ఈ మూడు రాశుల వారికి ఎంతో శుభప్రదమైనది.
మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 50 నిమిషాలకు బుధుడు శని గ్రహాల కలయిక దీని కారణం గా ఈ మూడు రాశుల వారికి ఎంతో శుభప్రదమైనది. ఆ మూడు అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి- మేష రాశి వారికి బుధుడు శుక్రుడి కలయిక వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వీరి ఆర్థిక పరిస్థితి అమాంతం పెరుగుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటినుంచో అప్పుల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. పాత అప్పులు తీర్చేందుకు కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా మీరు అనేక లాభాలను పొంది ఆస్తులను పొందుతారు. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. పూర్వికులు నుండి రావాల్సిన ఆస్తుల వ్యవహారంలో ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. తెలివిగా పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారంలో లాభాలు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇంటి కల నెరవేరుతుంది. విద్యార్థులకు మంచి సమయం.
కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి శని బుధ గ్రహం అనేక సానుకూల ఫలితాలను అందిస్తుంది. వ్యాపార విషయంలో మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక విషయాల పట్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీచింగ్ రంగంలో ఉన్న వారికి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి ఎక్కువ లాభాలు ఉంటాయి. పాత మొండి బకాయిలు వసూలు అవుతాయి. డబ్బుకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కోర్టు విషయాల్లో విజయం మీ వైపే ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. కోరుకున్నచోట సీటు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు ఉన్నాయి అరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి బుదిడి శని గ్రహాల కలయిక వల్ల అపారమైన సంపదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ధన లాభం వల్ల పురోగతి ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కోర్టు కేసుల్లో నుంచి ఉపశమనం పొందుతారు. న్యాయపరమైన వివాదాలు మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఆరోగ్యం పైన కొంచెం దృష్టి పెట్టాలి. కష్టపడి పనిచేయడం వల్ల మీకు లాభాలు వస్తాయి. శుభకార్యాలలో పాల్గొన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేసిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. వివాహం కాని వారికి వివాహమయ్య అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోయి సఖ్యత నెలకొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.