Astrology: డిసెంబర్ 17 చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..
ఇది కుటుంబంలో సంతోషము సంపదకు బాధ్యత వహించే గ్రహంగా చెప్పవచ్చు. 9 గ్రహాలలో ఇది ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది కుటుంబంలో సంతోషము సంపదకు బాధ్యత వహించే గ్రహంగా చెప్పవచ్చు. 9 గ్రహాలలో ఇది ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంది. చంద్రుడు రాశి మార్పు కారణంగా 12 రాశుల జీవితాల్లో మార్పులు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ మూడు రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి చంద్రుని సంచారం కారణంగా సానుకూల ప్రభావాలు ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా అదృష్టం లభిస్తుంది. అంతేకాకుండా మీ పనికి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. జాబ్ మేళాలో వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. కెరీర్ పరంగా ప్లాన్ చేసుకుంటారు. చంద్రుని అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం చివరి ఊర్లో మీకు ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు.
Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...
తులారాశి- తులారాశి వారికి చంద్రుని సంచారం సానుకూల ప్రభావాలను ఇస్తుంది. విద్యార్థులు ఇంతకుముందు కంటే ఇప్పుడు చదువులో ముందుంటారు. ఇది తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే విషయం మీకు ఏ పని చేపట్టిన అదృష్టం లభిస్తుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు లభిస్తాయి. దీనివల్ల మీ జీతం పెరుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహం కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. వ్యాపార పని సానుకూల ప్రభావం ఉంటుంది.
మిథున రాశి- మిథున రాశి వారికి చంద్రుని సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ లక్ష్యాలను సకాలంలో పూర్తిచేస్తారు. దీని కారణంగా మీ బాస్ కి మీ పైన సంతోషం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు వ్యాపార పెట్టుబడుల కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది మీకు లాభాలను తీసుకొని వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. పెళ్లి కాని వారికి ఈ నెల చివరిలోకి వివాహమయ్య అవకాశాలు ఉన్నాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పూర్వికుల నుండి రావాల్సిన ఆస్తులు వస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.