Astrology:సెప్టెంబర్ మూడు నుండి ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..కుజుడు రాశి మార్పు వల్ల ఆర్థిక నష్టాలు.

సెప్టెంబర్ 3 నుండి కుజుడు రాశి మార్పు కారణంగా అన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు మొదలవుతాయి.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా శక్తివంతమైన గ్రహం కుజుడు. సెప్టెంబర్ 3 నుండి కుజుడు రాశి మార్పు కారణంగా అన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఐదు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభరాశి: కుజుడు మిధున రాశిలోకి సంచరించడం వల్ల అనేక సమస్యలు ఆపదలు వస్తాయి. విద్యార్థులు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితుల ద్వారా మీకు నమ్మకద్రోహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు డ్రైవింగ్ చేయడం మానుకుంటే ఉత్తమం. మీ ఉద్యోగాల్లో కూడా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు వ్యాపారంలో నష్టాలు వస్తాయి.

మీన రాశి: ఈ రాశి వారికి మీ వ్యాపారంలో వచ్చే ఆదాయాల పైన ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆఫీసులో చేసే ఒక చిన్న పొరపాటు వల్ల మీ ఉద్యోగ సంక్షోభానికి ఇబ్బంది కలుగుతుంది. విద్యార్థులు చదువులో కాస్త వెనుకబడతారు. కోర్టు సమస్యలు ఇంకా పరిష్కారం అవ్వవు.

కన్యరాశి: మిధున రాశిలోకి కుజుడు సంచారం కారణంగా ఈ రాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడవచ్చు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న పాత వ్యాధి మళ్లీ ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల మీ ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా నిర్లక్ష్యం కారణంగా మీ ఉద్యోగంలో సమస్య రావచ్చు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చకండి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Astrology: హనుమంతునికి ఇష్టమైన 4 రాశులు ఇవే.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి అక్టోబర్ వరకు ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయులకు మధ్య గొడవలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ వాహనాలు దొంగతనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుంది. దీని వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడతారు.

మిథున రాశి: ఈ రాశి వారికి కుజుడి రాశి మార్పు కారణంగా అనేక ఆర్థిక నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భూమి విర్క్రయాల విషయాల్లో జాగ్రత్త మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కారు కొనకుండా ఉండండి. దానివల్ల మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఆఫీసులో సహ ఉద్యోగుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఆచితూచి మాట్లాడండి. విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి వీసా రావడం కష్టమవుతుంది. దీని వల్ల ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



సంబంధిత వార్తలు

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ