Astrology: నవంబర్ 29న శని గ్రహం మీనరాశిలోకి ప్రవేశం దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.
నవంబర్ 29న కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా 12 రాశుల పైన శుభ ఫలితాలు ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని కొన్ని శుభ ఫలితాలను ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు. నవంబర్ 29న కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా 12 రాశుల పైన శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శని దేవుని అనుగ్రహం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యారాశి- కన్య రాశిలో జన్మించిన వారికి శని సంచారం కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. కెరియర్ పరంగా ఉన్నత శిఖరాలకు వెళతారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఇంకాస్త మెరుగుపడుతుంది. కొత్తగా ప్రారంభించిన పనులు తొందరగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పెట్టుబడిల పైన అధిక లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
మకర రాశి- మకర రాశి వారికి శని సంచారం కారణంగా చాలా మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. దీని వల్ల మనసులో ఆనందం సంతోషం వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభిస్తుంది. మీరు ఏ పని చేయాలని నిర్ణయించుకున్న అందులో విజయాన్ని సాధిస్తారు. శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు మీపైన ఎప్పటికీ ఉంటాయి.
వృషభరాశి- వృషభ రాశి వారికి శని గ్రహం సంచారం కారణంగా అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. పనిలో మీకు పురోభివృద్ధి ఉంటుంది. పెట్టుబడుల గురించి మీరు చేసే ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆస్తి కొనుగోలు గురించి మీకు కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వివాహం కాని వారికి త్వరలో మంచి సంబంధం ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ధన లాభం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. దీనికి కారణంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల పర్యటనలకు అనుకూలం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.