Astrology: డిసెంబర్ 11న 5 అరుదైన యోగాల కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

భద్రవల, రవి యోగం, వారి యోగం ,వాణిజ్య యోగం, విష్టియోగం అనే ఐదు యోగాల అరుదైన కలయిక జరగబోతుంది.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్షం డిసెంబర్ 11వ తేదీన ఉదయం 3 గంటలకు ప్రారంభమవుతుంది.ఇదే రోజున 5 యోగాల కలయిక ఉంటుంది. భద్రవల, రవి యోగం, వారి యోగం ,వాణిజ్య యోగం, విష్టియోగం అనే ఐదు యోగాల అరుదైన కలయిక జరగబోతుంది. దీని కారణంగా అన్ని రాశుల పైన ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా ఈ మూడు రాశుల పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

వృషభ రాశి- వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ అరుదైన యోగాలు కలయిక వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగావస్థలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలకు వెళతారు. విద్యార్థులు ఇంతకుముందు కంటే ఇప్పుడు ఓపికగా శ్రద్ధగా చదువుతారు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు వస్తారు. ఇది లాభాలను పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు.

Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ 5 యోగాలు కలయిక వల్ల వీరు ధనవంతులు అవుతారు. వ్యాపారం చేసే వారికి చక్కటి లాభాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ వాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలో మంచి సంబంధం కరార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. మీరు పని చేసే చోట మీ యజమాని నుండి మీకు ప్రశంసలు అందుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీసులో కూడా గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గుతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి కోరికలు నెరవేరుతాయి మీరు పని చేసే చోట మీ సహోదయోగులతోటి మీకు మంచి సంబంధాలు ఉంటాయి. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మీ బాస్ మిమ్మల్ని త్వరలోనే ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మీ జీవితం రెట్టింపు అవుతుంది. శ్రీమహావిష్ణువు ఆశీస్సులతో రాబోయే రోజుల్లో వ్యాపార పరంగా ఆర్థిక పరిస్థితి మరింత దృఢంగా మారండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు వెళతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఎప్పటినుంచో అనుకుంటున్నా విదేశీ పర్యటనలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.