Astrology: శుక్ర గ్రహం నవంబర్ నెలలో మూడు సార్లు నక్షత్రాన్ని మార్చుకుంటుంది దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.

శుక్రుడు కీర్తికి ,సంపదకు, ఆనందానికి, అదృష్టానికి ఇవన్నీ ఇచ్చే గ్రహంగా భావిస్తారు. దీని కదలిక వల్ల 12 రాశుల పైన శుభ ప్రభావాలు కలిగి ఉంటాయి. అయితే శుక్రుడు నవంబర్ నెలలో మూడు సార్లు తన నక్షత్రాన్ని మార్చుకుంటాడు

Image is for representational purpose only (Photo Credits: Flickr)

ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుడు కీర్తికి ,సంపదకు, ఆనందానికి, అదృష్టానికి ఇవన్నీ ఇచ్చే గ్రహంగా భావిస్తారు. దీని కదలిక వల్ల 12 రాశుల పైన శుభ ప్రభావాలు కలిగి ఉంటాయి. అయితే శుక్రుడు నవంబర్ నెలలో మూడు సార్లు తన నక్షత్రాన్ని మార్చుకుంటాడు. దీని కారణంగా మూడు రాశులువారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి- మకర రాశి వారికి రానున్న రోజుల్లో అన్ని సానుకూల ఫలితాలు లభిస్తాయి. శుక్రుడు మూడుసార్లు తన నక్షత్రాన్ని మార్పు కారణంగా రానున్న 25 రోజుల్లో వీరికి అన్ని పనులు సులభంగా పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు మంచి జీవితం పెరుగుతుంది. కోరుకున్న లక్ష్యాలను సాధిస్తారు మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆఫీస్ లో గౌరవం కూడా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. దీని ద్వారా మీ అప్పులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త కస్టమర్ల ద్వారా మీకు భారీ లాభాలు అందుతాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు విద్యార్థులకు మంచి సమయం.

Vastu Tips: ఈ వస్తువులు పర్సులో పెట్టుకుంటే డబ్బుకు ఇబ్బంది ఉండదు ...

తులారాశి- తులారాశి వారికి శుక్రుడి నక్షత్రం మార్పు కారణంగా అన్ని సానుకూల ప్రభావాలు ఉంటాయి. ఉద్యోగులు తమ సహదేవులతో కలిసి మంచి సంబంధం బాంధవ్యాలు పెంచుకుంటారు. ప్రమోషన్ కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటే అవి పరిష్కారమయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం పట్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు తగ్గుతాయి. డబ్బులు రాబోయే 24 రోజుల్లో మీరు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. వ్యాపార విస్తరణ కోసం మీరు పెట్టుబడి పెట్టేవి లాభాలను తీసుకువస్తాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

మీన రాశి- మీన రాశి వారికి రాబోయే 24 రోజుల్లో శుక్రుడి నక్షత్ర మార్పు కారణంగా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. మీ పేరు మీద ఇల్లు కొనాలనుకునే కళ నెరవేరుతుంది. ప్రేమ వివాలకు అనుకూలం కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీరు పని చేసే చోట ఉన్నత పదవిని పొందుతారు. దీని ద్వారా మీ జీతం రెట్టింపు అవుతుంది. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తారు. ఇది మానసికంగా మీకు ఊరట కలిగిస్తుంది. పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న వ్యాధి నుండి బయటపడతారు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif