Astro Tips: పొరపాటున కూడా వీటిని దానం చేశారో లక్ష్మీదేవి మీ గుమ్మం దాటి వెళ్లిపోయినట్లే, దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది, చాలా జాగ్రత్త...

మత విశ్వాసాల ప్రకారం ఎప్పుడు కూడ దానం చేయకూడనివి చాలా వున్నాయి.

Reprasentive image

దానం చేసి సర్వం పోగొట్టుకున్న రాజులు, దేవుళ్ళు, మనుషులు అధిక సంఖ్యలోనే మన దేశంలో వున్నారు. అయితే దానంలో ఇవ్వాల్సినవి కాకుండా ఇవ్వకూడనివి ఇస్తే మాత్రం ఫలితం వేరే వుంటుంది. ఫలితంగా దానం చేసిన వ్యక్తులు ఇబ్బంది పడకతప్పుదు.

ఏ వస్తువుల దానం చేస్తే పుణ్యం వస్తుందో, ఏ దానం చేస్తే మనిషికి ఇబ్బందులు వస్తాయో గ్రంధాలలో క్షుణ్ణంగా రాసిపెట్టారు. మత విశ్వాసాల ప్రకారం ఎప్పుడు కూడ దానం చేయకూడనివి చాలా వున్నాయి.

 

Agnipath Scheme Row: అసలేం జరిగింది..సికింద్రాబాద్‌లో అగ్గి రాజేసిందెవరు, అదుపు తప్పిన యువకులతో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, క్షణాల్లో రైల్వే స్టేషన్ అంతటా దట్టమైన మంటలు 

ఏ వస్తువులు దానం చేయకూడదో శాస్త్రాల్లో క్లియర్ గా రాశారు. లక్ష్మీ మంచి సంపదకు దేవత గా భావిస్తారు. ఇంట్లో లక్ష్మీ ఉంటే సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి. లక్ష్మీదేవిని పూజించిన తర్వాత లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండాలని కోరుకుంటాం. అలాంటి లక్ష్మీదేవి ఫోటో ఇతరులకు దానం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వీడ్కోలు పలికినట్టే. లక్ష్మీదేవి, గణేశుడు చిత్రించిన వెండి నాణేలను ఎప్పుడు ఇతరులకు దానం చేయకూడదు.

సంపన్నులకు ఎప్పుడు పాత్రల దానం చేయకూడదు. ఆ వ్యక్తులకు పాత్రలు దానం చేయడం వల్ల వాళ్ళు ఆ పాత్రలను ఎప్పుడు వాడరు. ఈ కారణంగా విరాళానికి ఎలాంటి ప్రాధాన్యత వుండదు. పాత్రలు దానం చేయాలి అనుకుంటే అవసరమైన వ్యక్తులకే దానం చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో సుఖ, సంతోషాలు కలగాలి అంటే ధార్మిక పుస్తకాలను ఇతరులకు దానం చేయాలి.

ఇక సనాతన ధర్మంలో అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానంగా పరిగణించారు. పేదవారికి, ఆకలితో వున్నవారికి ఆహారాన్ని ఇవ్వడం మంచి పనిగా చెప్పారు. అలా చేయడం ద్వారా దేవుడు కూడ సంతోషిస్తాడట. అయితే పాత లేదా పాడైన ఆహారాన్ని ఎప్పటికి దానం చేయకూడదు. ఇలా చేయడం ద్వారా భోజనం చేసే వ్యక్తిని, తల్లి అన్నపూర్ణ ను అవమానించినట్టే అవుతుంది.