Golconda Bonalu 2023: గోల్కొండలో మొదలైన బోనాల పండుగ, ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించిన మంత్రులు

ఇవాళ్టి నుంచి బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు రంగం సిద్ధం చేశారు. మొట్ట‌మొద‌ట‌గా ఇవాళ గోల్కొండ అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోట లంగర్‌హౌస్‌ చౌరస్తాలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని, మహ్మద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించారు.

Golconda Bonalu 2023 (Photo-Twitter)

Hyd, JUne 22: ఆషాఢ బోనాలకు జంట నగరాలు ముస్తాబయ్యాయి. ఇవాళ్టి నుంచి బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు రంగం సిద్ధం చేశారు. మొట్ట‌మొద‌ట‌గా ఇవాళ గోల్కొండ అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోట లంగర్‌హౌస్‌ చౌరస్తాలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని, మహ్మద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించారు.

అనంతరం ఊరేగింపును ప్రారంభించారు. లంగ‌ర్ హౌస్ నుంచి ర‌థం, తొట్టెల ఊరేగింపు ప్రారంభ‌మై గోల్కొండ కోట‌లోని జ‌గ‌దాంబ ఆల‌యం వ‌ర‌కు కొన‌సాగింది. ఉత్సవ విగ్రహాలకు ఆల‌య క‌మిటీ స‌భ్యులు, ప్రధానార్చకుల ఇంట్లో ఘ‌నంగా పూజ‌లు నిర్వహించారు. బోనాలలో పోతురాజులు, భాజా భజంత్రీలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కొల్లూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ టౌన్‌షిప్‌ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, రూ.1,489.29 కోట్ల వ్యయంతో హౌసింగ్ నిర్మాణం

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ పండుగ‌ల్లో ఒకటైన బోనాల పండుగ‌ను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగ‌గా ప్రకటించిందన్నారు.హైదరాబాద్ పట్టణంలోని మన భాగ్యనగరంలో బోనాల పండుగ ప్రారంభమైందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈరోజు జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాలలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు. నెలరోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటామని, తెలంగాణ వచ్చిన తర్వాత ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభం సందర్భంగా రోడ్లు మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాలివే!

బోనాల పండుగకు 15 కోట్ల బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని, బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వర్షంతో దేవుడు స్వాగతం పలికాడని మంత్రి తెలిపారు. నేటితో దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమర వీరుల జ్యోతి ప్రజ్వలన చేయనున్నట్లు తెలిపారు. అందరూ సహకరించి పండుగను ఘనంగా నిర్వహించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మహంకాళి, జగదాంబిక జాతర బోనాల ఉత్సవాలు నేడు ప్రారంభమవుతున్నాయని, తెలంగాణ నడిబొడ్డున ఉన్న జగదాంబిక అమ్మవారికి వైభవంగా బోనాలు సమర్పించామన్నారు. తెలంగాణ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో బోనాలు జరిగాయని తలసాని వెల్లడించారు.హైదరాబాద్ అంతటా సికింద్రాబాద్, లాల్ దర్వాజ్ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని మంత్రి తలసాని కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోల్కొండ జగదాంబిక అమ్మవారి జాతర చాలా తక్కువ మందితో జరిగేది. కానీ, ఇప్పుడు లక్ష మందికి పైగా పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. పట్టువస్త్రాలు సమర్పించి ఆషాడ మాసం మొత్తం బోనాల జాతర కొనసాగుతుందని, వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ బోనాలకు తరలివస్తారని తెలిపారు. ఎక్కడా లేని విధంగా బోనాల జాతర వైభవంగా నిర్వహిస్తున్నామని, పండుగకు ముందు బోనాల పండుగకు 15 కోట్ల రూపాయలు ఇచ్చామని మంత్రి తలసాని తెలిపారు.



సంబంధిత వార్తలు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Kissik Song Release Date: పుష్ప -2 నుంచి కిస్సిక్ సాంగ్ వ‌చ్చేస్తోంది! స‌మంత పాట కంటే రెట్టింపు వోల్టేజ్ తో రాబోతున్న శ్రీ‌లీల ఐటెం సాంగ్, ఇంతకీ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Antony Thattil: ఎవరీ ఆంటోనీ తట్టిల్?, కీర్తి సురేష్‌ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి నెటిజన్ల సెర్చ్, వీరిద్దరి పరిచయం ఎక్కడ జరిగిందో తెలుసా!

CM Revanth Reddy: వరంగల్‌ గడ్డ నుంచి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రుణమాఫీ కాని రైతుల రుణాలన్నీ త్వరలో మాఫీ చేస్తామని ప్రకటన