Happy Dhanteras 2021 Wishes: దంతేరాస్ పండుగ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, మిత్రులకు, బంధు మిత్రులకు ఈ మెసేజ్‌స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పేయండి
అయితే ఈ సంవత్సరం కొన్ని మహాముహూర్తాల కారణంగా, దంతేరాస్ (Dhanteras 2021)కు కొన్ని రోజుల ముందు నుంచే షాపింగ్ చేసే వీలు చిక్కనుంది.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి నాడు దంతేరాస్ (Dhanteras 2021) పండుగను జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం కొన్ని మహాముహూర్తాల కారణంగా, దంతేరాస్ (Dhanteras 2021)కు కొన్ని రోజుల ముందు నుంచే షాపింగ్ చేసే వీలు చిక్కనుంది. హిందూ మతం ప్రకారం, దీపావళి ఐదు రోజుల పండుగ కార్తీక మాసంలో ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ప్రజలు ఇళ్లు, భూమి, కార్లు, బంగారు ఆభరణాలు, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైన వాటిని కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
అయితే జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, ఈ సంవత్సరం ధన్‌తేరస్‌కి కొన్ని రోజుల ముందు, కొన్ని రాశుల అద్భుతమైన కలయిక జరగనుంది. ఈ కారణంగా, 2021 అక్టోబర్ 28, గురువారం నాడు ఒక ప్రత్యేకమైన సందర్భం జరుగుతోంది. జ్యోతిష్కులు కథనం ప్రకారం, ఈ మహాముహూర్తం, కొన్ని ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా భారీ లాభాలను పొందవచ్చు.
ఎప్పటిలాగే, ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని త్రయోదశి (నవంబర్ 2, 2021, మంగళవారం) నాడు ధన్ తేరస్ జరుపుకుంటారు. ఆ రోజున ఈ శుభాకాంక్షలతో మిత్రులకు కోట్స్ చెప్పేద్దాం.
ఈ రోజున బంగారం (Gold) కొంటే లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించినట్టు అన్న నమ్మకం, విశ్వాసం భారతీయుల్లో ఉంది. అందుకే ధంతేరాస్ (Dhanteras 2021) రోజున దేశంలోని నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. ఏ నగల షాపు (Gold Shop) చూసినా రద్దీగా కనిపిస్తుంటాయి.
ఈ రోజు బంగారం లేదా వెండి, ఏవైనా వంట సామాగ్రి కొనుగోలు చేస్తే సంపద పొందుతారని నమ్ముతారు. అంతేకాకుండా అదృష్టవంతులవుతారని భావిస్తారు. కుటుంబంలో ఆందరూ ఆయురారోగ్య ఐశ్వార్యాలతో ఉంటారని ప్రతిదీ. అందుకే ఈ రోజ ఏ చిన్న వస్తువైనా కొనుగోలు చేస్తారు.
మీరు ఈ రోజు వెండి లక్ష్మి-గణేష్ నాణేలను కూడా కొనుగోలు చేయవచ్చు. మంగళవారం నాడు ద్వాదాశి తిథి యాదృశ్చికంగా శుభ యోగం జరగనుంది. అయితే, ద్వాదశి తిథి నవంబర్ 1న ప్రారంభమై నవంబర్ 2వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు ఉంటుంది. కాబట్టి నవంబర్ 2వ తేదీ మంగళవారం సూర్యోదయం నుంచి ఉదయం 11 గంటల వరకు త్రిపుష్కర యోగం లభిస్తుంది. ఈ సమయంలో బంగారం, వెండి, మట్టి దీపాలు కొనుగోలు చేయడం చాలా పవిత్రమైందిగా పరిగణిస్తారు.
ఈ శుభ సమయంలో కొనుగోలు చేయడం వల్ల 3 రెట్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు ఈ త్రిపుష్కర యోగ సమయంలో ఇల్లు, వాహనం లేదా నగలు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో అది మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు.
మార్కెట్ నుంచి కొత్త వస్తువులు కొనడానికి ఇది అమృత సమయంగా పరిగణిస్తారు. ధంతేరాస్ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అమృత గ డియలు. మనం త్రిపుష్కర యోగా, ప్రయోజనాన్ని అమృత యోగ సమయాన్ని కలిపితే ధంతేరాస్ రోజు మధ్యాహ్నం 1.30 వరకు ఏవైనా వస్తువులు కొనుగోల్లు చేయడానికి శ్రేయస్కరం.