Dussehra 2022 Wishes: దసరా పండగ శుభాకాంక్షలు, బంధు మిత్రులకు ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పండి, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దసరా విషెస్, వాట్సప్ మెసేజ్‌స్ మీకోసం
విజయదశమి (Happy Dussehra) రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.
చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Dussehra 2022) అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది.
చరిత్ర ప్రకారం విజయదశమి (Happy Dussehra) రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు. ఈ కోట్స్ ద్వారా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
మీకు మీ కుటుంబ సభ్యులకు లేటెస్ట్‌లీ తరపున దసరా పండుగ శుభాకాంక్షలు