Happy Independence Day 2020 Greetings: భారత స్వాతంత్ర్య దినోత్సవం, అందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, WhatsApp Status, Quotes, Facebook Captions మీకోసం..

దేశాన్ని రాబందుల కబంధ హస్తాల నుండి రక్షించుకోవడానికి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. కుల మత బేధాలు లేకుండా ప్రాంతాల తారతమ్యం లేకుండా అన్నదమ్ముళ్ల లాగా కలిసి జీవిస్తున్నాం. ఈ రోజు భారతీయలకు నిజంగా గొప్ప పండుగ. భారత స్వాతంత్ర్య దినోత్సవం (Happy Independence Day 2020) రోజున అందరూ జాతీయ జెండా వందనం చేసి బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు (74th Independence Day 2020 Greetings) చెప్పుకుంటారు.

Representational Image (Photo Credits: File Image)

ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాల ఫలితంగా మనం ఈ రోజు స్వేచ్ఛగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం. దేశాన్ని రాబందుల కబంధ హస్తాల నుండి రక్షించుకోవడానికి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. కుల మత బేధాలు లేకుండా ప్రాంతాల తారతమ్యం లేకుండా అన్నదమ్ముళ్ల లాగా కలిసి జీవిస్తున్నాం. ఈ రోజు భారతీయలకు నిజంగా గొప్ప పండుగ. భారత స్వాతంత్ర్య దినోత్సవం (Happy Independence Day 2020) రోజున అందరూ జాతీయ జెండా వందనం చేసి బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు (74th Independence Day 2020 Greetings) చెప్పుకుంటారు.

భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్దంలో చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక 19వ శతాబ్దం నాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ రావడం జరిగింది. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగి భారత సిపాయిలు, రాజులు అందులో ఓడిపోయాకా 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాక దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం, మీకు తెలియని ఆసక్తికర విషయాలు, జాతీయ జెండా గురించి కొన్ని నిజాలు మీకోసం..

ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాల వల్ల భారతదేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం (Independence Day 2020) వచ్చింది. బ్రిటీష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1948లో ఈ స్వాతంత్ర్య దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15న జరగాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. ఈ ఏడాది తో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74ఏళ్ళు అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలకు 30 అవార్డులు, ఉత్తమ సేవలందించిన పోలీసులకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం, వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట

భారత స్వాతంత్ర్య దినోత్సవం కొటేషన్లు, కోట్స్ విషెస్ మీకోసం

1. అన్ని దేశాల్లో కెల్లా భారతదేశం మిన్న అని చాటి చెబుతూ జరుపుకుందాం ఈ పండుగను కన్నుల విందుగా.. అందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

2. నేటి స్వాతంత్ర్య సంబరం..ఎందరో త్యాగవీరుల త్యాగఫలం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

3. బానిస సంకెళ్లను తెంచి స్వేచ్ఛా వాయువుల కోసం వందల ఏళ్లు తెగించి పోరాడిన మన వీరత్వం భరతమాతకు పట్టం కట్టిన త్యాగధనుల కర్మఫలం. 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

4.మాతృభూమి కోసం తన ధన, మాన ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

5. ఏ దేశమేగినా -ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా- ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండుగౌరవం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

6. సమరయోధుల పోరాట ఫలం..అమర వీరుల త్యాగఫలం బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్ర్య దినోత్సవం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

7. సామ్రాస్యవాదుల సంకెళ్లు తెంచుకుని భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

8. బానిస బతుకులకు విముక్తి చెబుతూ.. అమర వీరుల త్యాగాలను గౌరవిస్తూ.. ఏటా జరుపుకునే సంబరాల సంబరం.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

9. మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అసువులు బాసిన సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. అందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు