Red Fort in Delhi (Photo Credits: Wikimedia Commons)

New Delhi, August 14: హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) పోలీసు సిబ్బందికి పతక పురస్కారాల జాబితాను #IndependenceDay 2020 లో ప్రకటించింది. 215 మంది సిబ్బందికి ధైర్యసాహసాలకు పోలీసు పతకం, 80 మంది విశిష్ట సేవలకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, 631 మంది మెరిటోరియస్ సర్వీస్ కోసం పోలీస్ మెడల్ పొందారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు (Police Personnel) కేంద్రహోంశాఖ మెడల్స్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కేంద్ర హోంశాఖ వివిధ రాష్ష్ర్టాల నుంచి ఉత్తమ సేవలందించిన 215 మందిని గ్యాలంట్రీ పోలీస్ మెడల్‌కు, 80 మందిని ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌కు​ , 631 మందిని విశిష్ట సేవ పోలీస్ పతకాలకు ఎంపిక చేసింది.

ఈ సందర్భంగా 2020 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి 16 మంది‌, తెలంగాణ నుంచి 14 మంది మెడల్స్‌ అందుకోనున్నారు. ఏపీకి వచ్చిన 14 పతకాల్లో.. రెండు విశిష్ట సేవా ప్రెసిడెంట్‌ పోలీసు మెడల్స్‌, 14 ఉత్తమ సేవా పోలీసు మెడల్స్‌ ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో ఇద్దరు గ్యాలంట్రీ పోలీస్ మెడల్, ఇద్దరు రాష్ట్రపతి పోలీస్ మెడల్, 10 మంది విశిష్ట సేవా పోలీస్ పతకాలను అందుకోనున్నారు.ఏపీ అడిషనల్‌ డీజీపీ రవిశంకర్‌తో పాటు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కుమార్ విశ్వజిత్‌ ప్రెసిడెంట్ పోలీసు మెడల్‌ అందుకోనున్నారు.

Update by ANI

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. ఎర్రకోట పరిసర ప్రాంతాలన్నీ పోలీస్ వలయంలో ఉన్నాయి. ఇప్పటికే రిహార్సల్ చేశారు. అందరినీ కలుపుకుని 5వేల మందికి ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా సామాజిక దూరం పాటించే విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు, కేంద్రపారామిలటరీ బలగాలతో ఎర్రకోట ప్రాంతమంతా జల్లెడపడుతున్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపైనుంచి జాతీయ జెండా ఎగురవేస్తారు. ప్రధాని ప్రసంగించే వేదిక చుట్టూ బుల్లెట్ ఫ్రూప్ ఏర్పాటు చేశారు.