MahaShivratri Wishes: మహాశివరాత్రి కోట్స్ తెలుగులో, మీ కోసం మహా శివరాత్రి మెసేజెస్ రెడీగా ఉన్నాయి. మహా శివరాత్రి వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం..
ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు
Maha Shivratri Messages in Telugu: శివ, పార్వతుల వివాహం జరిగిన రోజునే మహాశివరాత్రి అంటారనే కథనం ఉంది. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు.మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది.
ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. హిందువుల క్యాలెండర్ నెలలో మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది. మహా మృత్యుంజయ మంత్రం వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాలు శక్తి ఈ రాత్రి గొప్పగా పెరుగుతుంది
పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి, సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేస్తారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు . రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు.
అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది . పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము/విభూతి తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ", శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు.
పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాంబశివ శంభోశంకర శరణం, మే తవ చరణయుగం శివాయ నమహో, శివాయ నమహా.. ఓం నమ శివాయ:
ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
మహా శివరాత్రి శుభాకాంక్షలు