IPL Auction 2025 Live

International Day of Yoga 2022: ప్రపంచ యోగా దినోత్సవం, ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాల్లో ఒకటి, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎవరు ప్రారంభించారు

మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా (Yoga Day 2022) ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను (International Day of Yoga) పాటిస్తున్నాయి.

Yoga Day 2022 Wishes

ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా (Yoga Day 2022) ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను (International Day of Yoga) పాటిస్తున్నాయి. యోగా అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదం నుంచి పుట్టింది. యజ అంటే దేనినైనా ఏకం చేయగలగడం అని అర్థం. ఆసనం అన్న పదానికి సంస్కృతంలో భంగిమ అని అర్థం ఉంది. ఈ రెండింటిని కలిపి యోగాసనాలు అని పిలుస్తారు. మనస్సును,శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మిక తాదాత్మ్యం అందించేదే యోగా అని చెబుతారు. భారతదేశంలో వేద కాలం నుంచే యోగ ఉందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. పరమ శివుడు మొదట తన పత్ని పార్వతికి యోగా గురించి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

సెప్టెంబర్ 27,2014న అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ముందు పెట్టారు. దానికి 193 ఐరాస మద్దతు లభించడంతో అప్పటినుంచి అంతర్జాతీయ యోగాను జూన్ 21న నిర్వహిస్తున్నారు. ఆరోజున అన్ని దేశాలు యోగా డేగా పాటిస్తున్నాయి. ఇదే రోజున యోగా జరుపుకోవడానికి మరో ముఖ్య కారణం...ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజు జూన్ 21వ తేదీ. పగటి సమయం ఎక్కువగా ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో.. అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం-2022, ఈ ఏడాది మానవత్వం కోసం యోగా స్లోగన్‌ను నిర్వహించనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ

జూన్ 21,2015న ప్రపంచమంతా తొలిసారిగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంది. భారత్‌లో ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఆ వేడుకలను నిర్వహించగా... 84 దేశాల నుంచి వచ్చిన నేతలు అందులో పాల్గొన్నారు.మొత్తం 35,985 మంది యోగా చేసి గిన్నీస్ బుక్ రికార్డు నెలకొల్పారు. అప్పటినుంచి ప్రతీ ఏటా భారత్‌లో ఏదో ఒక నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆనవాయితీగా అందులో పాల్గొంటున్నారు. గతేడాది కరోనా కారణంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఎవరి ఇళ్లల్లో వారే యోగా చేయాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. 'క్షేమం కోసం యోగా' అనే థీమ్‌తో ఈసారి దేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపనున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఈ థీమ్ ఇచ్చారు.