Holi 2022: ఇంట్లో పిల్లలు, పెద్దలు అనారోగ్యంతో ఉన్నారా, నరదిష్టితో నష్టాలు వస్తున్నాయా, అయితే హోలీ పండగ వేళ నరసింహస్వామిని ఇలా పూజిస్తే, కోరికలు తీరుతాయి...
మీ ఇంట్లో పెద్దలు, పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారా, నరదిష్టి తగిలి ఆర్థిక నష్టాలు వస్తున్నాయా అయితే హోలికా దహనానికి ముందు, నరసింహ స్వామిని పూజించండి.
Holi 2022: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు హోలికా దహనం చేస్తారు. హోలీ మరుసటి రోజు అంటే చైత్ర మాసంలోని కృష్ణ పక్షం ప్రతిపాద తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజున రంగులతో ఆడుకుంటారు. ఈసారి హోలికా దహనం మార్చి 17న జరుగనుంది. హోలికా దహనం సాయంత్రం శుభ సమయంలో జరుగుతుంది. హోలికా దహనం సమయంలో కొన్ని పూజలు చేయడం ద్వారా, అనేక రకాల జీవిత సమస్యల నుండి బయటపడతారు.
ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్, సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సీఎం జగన్ ఆగ్రహం
మీ ఇంట్లో పెద్దలు, పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారా, నరదిష్టి తగిలి ఆర్థిక నష్టాలు వస్తున్నాయా అయితే హోలికా దహనానికి ముందు, నరసింహ స్వామిని పూజించండి. హారతి లేకుండా ఏ పూజా సంపూర్ణం అని పరిగణింరు. కాబట్టి, హోలికా దహనం ముందు పూజ చేసిన తర్వాత, నరసింహ స్వామికి హారతి కింద శ్లోకం చదువుతూ హారతి ఇవ్వండి. దీంతో భక్తుల కష్టాలు తీరి, కోరిన కోర్కెలు తీరుతాయి.
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం
పైన తెలుపబడింది నృశింహ మంత్రం. ఇందులో వున్న ఒక్కొక్క నామం నృశింహుని ఒక్కో తత్త్వాన్ని తెలియజేస్తుంది. ఈ శ్లోకం చదువుతూ నరసింహస్వామిని పూజించండి. మీ కష్టాలు తొలగిపోతాయి.