Horoscope Today 17 May 2022: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు ఈ రోజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయవద్దు, ఈ రాశి వారికి విద్య, వ్యాపారాల్లో విజయం, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...

Horoscope Today 17 May 2022: మంగళవారం నాడు, వృషభ రాశి వారు తమ సహోద్యోగులను దృష్టిలో ఉంచుకుని పూర్తి ప్రయోజనాలు పొందవలసి ఉంటుంది, ఉమ్మడి కుటుంబంలో నివసించే తుల రాశి వారు అందరినీ వెంట తీసుకెళ్లాలి.

horoscope

Horoscope Today 17 May 2022: మంగళవారం నాడు, వృషభ రాశి వారు తమ సహోద్యోగులను దృష్టిలో ఉంచుకుని పూర్తి ప్రయోజనాలు పొందవలసి ఉంటుంది, ఉమ్మడి కుటుంబంలో నివసించే తుల రాశి వారు అందరినీ వెంట తీసుకెళ్లాలి.

మేషం

వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి ధనవ్యయ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి.

వృషభం

ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

మిధునం

ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల, సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం

చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

సింహం

ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

కన్య

నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆపదల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.

తుల

గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికం

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

ధనస్సు

మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.

మకరం

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. దైవచింతన పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

కుంభం

చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వాహన అనుకూలత కలుగుతుంది. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

Rahul Gandhi Padayatra: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర, కాంగ్రెస్ చింతన్ శివిర్ సమావేశాల్లో కీలక నిర్ణయం 

మీనం

ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.