Snake In Dream: స్వప్న శాస్త్రం ప్రకారం మీ కలలో పుట్టలోకి వెళ్తున్న పాము కనిపించిందా అయితే, మీరు కోటీశ్వరులు అయినట్లే, ఎలాగో తెలుసుకోండి
కలలో పాము వస్తే ఏం జరగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ప్రత్యేకంగా మీ కోసం..
చాలా మందికి కలలో పాములు కనిపిస్తుంటాయి. కలలో పాము వస్తే ఏం జరగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ప్రత్యేకంగా మీ కోసం..
కలలో మెరుస్తున్న పాము
రాత్రి నిద్రిస్తున్నప్పుడు కలలో తెలుపు లేదా బంగారు లేదా ప్రకాశవంతమైన పాము కనిపిస్తే, అది ప్రారంభ అదృష్టానికి సంకేతం. ఇది మీ పూర్వీకుల ఆశీర్వాదాలను కూడా సూచిస్తుంది.
చనిపోయిన పాము కనిపిస్తే..
మీకు కలలో చనిపోయిన పాము కనిపిస్తే, మీరు రాహు దోషం వల్ల కలిగే అన్ని సమస్యలను అధిగమిస్తారని, మీ శుభ ముహూర్తాలు ఇప్పటి నుండి ప్రారంభమవుతాయని అర్థం.
పాము కల
మీ కలలో పాము ఎక్కడికో వెళుతున్నట్లు లేదా మిమ్మల్ని చూసిన తర్వాత దాక్కున్నట్లు కనిపిస్తే, దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడని అర్థం.
పాము తన చర్మం లేదా కుబుసం తొలగిస్తున్నట్లు కల
మీ కలలో పాము తన కుబుసం తొలగిస్తున్నట్లు మీరు కలలుగన్నట్లయితే, అది సంపదకు చిహ్నం..ఈ కల మీరు త్వరలో సంపదను పొందుతారని సూచిస్తుంది.
పుట్టలోకి వెళ్తున్న పాము
పాము పుట్టలోకి వెళ్తున్నట్లు కలలుకంటున్నట్లయితే, మీకు త్వరలో డబ్బు లభిస్తుందని సూచిస్తుంది.
తెల్ల పాము కాటు వేసినట్లు కల
తెల్లటి పామును చూడటం మరియు కాటు వేయడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల చాలా డబ్బు వస్తుంది. ఇది భగవంతుని రూపంగా పరిగణించబడుతుంది.