Monday Pooja: సోమవారం పరమశివుడిని ఎలా పూజించాలో తెలుసుకోండి, శని ప్రభావంతో పట్టిన కష్టాలను తొలగించుకోండి..

శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. పరమశివుడిని కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం.

(Photo Credits: File Image)

శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. పరమశివుడిని కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. భోళా శంకరుడు ప్రసన్నుడై, భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి . సోమవారం రోజు శివుని ఆరాధన రోజు..ఈ రోజున ఏ శివలింగాన్ని ఏ విధంగా పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.

1. సోమవారం శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే దాని నుంచి బయటపడటానికి మీరు శివుడికి తప్పనిసరిగా ఆవు పాలు సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది.

2. సోమవారం ఉదయమే ఓం నమః శివాయ అనే పంచాక్షరి జపించడం చాలా పవిత్రంగా భావిస్తారు. మీరు కుటుంబ పరంగా కష్టాలు పడుతుంటే సోమవారం శివలింగంపై నీటితో అభిషేకం చేయండి. శివలింగానికి వివిధ రకాల వస్తువులతో అభిషేకం చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు అందుకుంటారు. అంతేకాకుండా శివుడి అనుగ్రహం పొంది సానుకూల ఫలితాలు పొందుతారు.

Russia- Ukraine Conflict:యుక్రెయిన్‌ రైల్వేస్టేషన్‌పై రాకెట్ దాడులు 30 మంది మృతి, వందమందికి పైగా తీవ్రగాయాలు, యుక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యన్ బలగాల మారణకాండ, వెనక్కు తగ్గుతామని చెప్పి మాటతప్పిన రష్యా

3. సోమవారం శివ ధ్యానం మీరు శని సంబంధిత దోషంతో బాధపడుతున్నా, కాలసర్ప దోషం ఉన్నా బయటపడటానికి మీరు ప్రత్యేకంగా శివ ధ్యానం చేయాలి. వెంటనే శని దోషం తొలగిపోయి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం

4. శత్రువుల నుంచి ప్రమాదంలో ఉంటే భయాన్ని అధిగమించడానికి మీరు ప్రత్యేకంగా సోమవారం పంచాక్షరి జపించాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో జపించాలి. మీకు ఎటువంటి ఆపదలు ఉన్నా తొలగిపోతాయి.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Fire Accident in UP: ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. రోజుల వయసున్న పది మంది నవజాత శిశువులు సజీవ దహనం.. (వీడియో)

Railway Shock To Reel Creators: రీల్స్ క్రియేట‌ర్ల‌కు రైల్వే శాఖ బిగ్ షాక్! ఇక‌పై ట్రైన్లు, రైల్వే ట్రాక్స్, స్టేష‌న్ల‌లో రీల్స్ చేస్తే నేరుగా ఎఫ్ఐఆర్ న‌మోదు

Cocaine worth Rs 900 crore seized: ఢిల్లీలో భారీ ఎత్తున డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌, ఏకంగా రూ. 900 కోట్ల విలువైన కొకైన్, ఇత‌ర మాద‌క ద్ర‌వ్యాలు సీజ్