Vastu Tips: ఈ వెండి నాణెం మీ పూజగదిలో ఉంటే లక్ష్మీ దేవి నట్టింట్లోకి నడిచి రావడం ఖాయం, డబ్బుకు కొదవ ఉండదు, అన్నింట్లోనూ విజయం దక్కుతుంది..

కొన్నిసార్లు ఒకే వెండి నాణెంపై లక్ష్మీదేవి, గణేశుడి చిత్రం ఉంటుంది. చాలా మంది హిందువులు అలాంటి నాణేలను తమ ఇళ్లలో ఉంచుకుంటారు.

(Photo Credits: File Image)

ఆర్థిక సమస్యలు ఒక్కోసారి అందరినీ వెంటాడతాయి.  జ్యోతిష్యం, వాస్తు వంటి శాస్త్రాల సహాయంతో ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు.  ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి ఈ శాస్త్రాలలో అనేక నివారణలు సూచించబడ్డాయి. వాటిలో ఒకటి వెండి నాణెం పరిష్కారం.

లక్ష్మీ దేవి లేదా గణేశుడి చిత్రాలతో కూడిన వెండి నాణేలు ఇంటికి సంపదను ఆకర్షిస్తాయి. కొన్నిసార్లు ఒకే వెండి నాణెంపై లక్ష్మీదేవి, గణేశుడి చిత్రం ఉంటుంది. చాలా మంది హిందువులు అలాంటి నాణేలను తమ ఇళ్లలో ఉంచుకుంటారు.

వినాయకుడు, లక్ష్మిచే అనుగ్రహించబడిన వ్యక్తికి ఆర్థిక సమస్యలు ఎప్పటికీ ఎదురుకావు. కొన్ని నాణేలపై ఒకవైపు లక్ష్మీదేవి  మరోవైపు గణేశుడు ఉంటాయి. రెండు వైపులా ఒకే దేవుడి చిత్రం ఉన్న నాణేలు కూడా ఉన్నాయి.

పక్కింటోడితో లేచిపోయిన భార్య, మనస్థాపంతో భర్త ఆత్మహత్య, చనిపోయే ముందు ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

ఇంట్లో లక్ష్మి, గణేశుడి వెండి నాణేలు ఎక్కడ  ఉంచాలి?

>> లక్ష్మీ రూపు ఉన్న నాణేన్ని శుక్రవారం మాత్రమే ఇంటికి తీసుకురావాలి.

>> ఈ నాణేలను పూజా గదిలో గణేశుడు లేదా లక్ష్మీదేవి ప్రతిమకు ఎదురుగా ఉంచుతారు.  ఈ నాణేన్ని భక్తితో పూజించాలి. లక్ష్మీ మరియు గణేశునికి ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి. అప్పుడు మీ హృదయంలోని కోరికను వ్యక్తపరచాలి.

లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురికాకుండా జాగ్రత్తపడండి..

>> ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

>> ఇంట్లోని వ్యక్తులందరికీ అంతర్గత శుద్ధి ఉండాలి - భగవద్గీత, శ్రీమద్ భగవద్ పురాణ పఠనం జరగాలి.

>> అతిథులను ప్రేమతో ఆదరించాలి.

>> లక్ష్మి దేవి అనుగ్రహం పొందడం సులభమే కానీ నిలుపుకోవడం కష్టమని గుర్తుంచుకోండి.