Sadar Festival Celebrations: సదర్‌ పండగ వేడుకలకు ముస్తాబైన హైదరాబాద్, యాదవ కులస్తులు మాత్రమే ఘనంగా జరుపుకునే ఉత్సవాల గురించి ఓ సారి తెలుసుకుందామా, దున్నపోతులతో యువకుల కుస్తీ సదర్‌లో ప్రత్యేక ఆకర్షణ

ఈ పండగను (Dunnapothula panduga) నగరంలోని యాదవ కులస్తులు మాత్రమే జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా, దీపావళి ముగిసిన రెండో రోజున సదర్‌ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని

Sadar Festival Celebrations 2021 (Photo-ANI)

సదర్‌ పండగ హైదరాబాద్‌ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో (Sadar Festival Celebrations 2021) చాలా ముఖ్యమైనది. ఈ పండగను (Dunnapothula panduga) నగరంలోని యాదవ కులస్తులు మాత్రమే జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా, దీపావళి ముగిసిన రెండో రోజున సదర్‌ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని దున్నపోతుల ఉత్సవం, వృషభ రాజుల పండుగగా (buffalo carnival) కూడా వ్యవహరిస్తారు. 'సదర్‌' అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం 'ప్రధానమైనది' అని అర్థం. యాదవ కులస్తులు ఒక ప్రత్యేకమైన ప్రధాన ఉత్సవంగా ఈ సదర్‌ను నిర్వహించుకుంటారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవ ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు.

ప్రారంభంలో హైదరాబాద్‌లో (Sadar Festival celebrated in Hyderabad) తప్ప స‌ద‌ర్ పండ‌గ దేశంలో మరే ఇత‌ర ప్రాంతాల్లో జ‌ర‌గేది కాదు. రానున రాను ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ పండుగ నాడు యాదవులు తమ జీవ‌నాధార‌మైన మేక‌లు, గొర్రెలు, ఆవులు, గేదెల‌ను కూడా వేడుక‌లు జ‌రిగే ప్రాంతాల‌కు తీసుకువస్తారు. భాగ్యనగరంలోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతా బాద్‌, సైదాబాద్‌, బోయిన్‌పల్లి, ఈస్ట్‌మారెడ్‌ పల్లి, చప్ప ల్‌బజార్‌, మధురాపూర్‌,కార్వాన్, పాతబస్తీ తదితర మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పటి వరకూ నారాయణగూడలో జరిగే ఉత్సవాలు నగర దృష్టిని ఆకర్శించే స్థాయిలో సాగుతున్నాయి. యాదవ కులస్తులు ఎక్కువగా ఉండే మున్సిపల్‌ డివిజన్లు, కాలనీలు, అపార్టుమెంట్ల ప్రాంగణాల్లో ఎక్కువ ఈ సంబురాలు జరుగుతున్నాయి. 'బఫెలో కార్నివాల్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌' పేరుతో జరుగుతున్నాయి.

సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం, హైదరాబాద్‌లో సందడి చేయనున్న కోట్ల రూపాయల దున్నపోతులు.

రియల్‌ ఎస్టేట్‌ ప్రభావం నేపథ్యంలో 2009 నుండి ఈ ఉత్సవాలు కొత్త పుంతలను తొక్కాయి. ఇందుకోసం ఉత్త‌ర‌ భార‌త‌దేశం లోని పంజాబ్, హర్యానాల నుంచి భారీ శ‌రీరం క‌లిగిన ముర్రా జాతికి చెందిన దున్నలను న‌గ‌రానికి తీసుకువ‌స్తున్నారు. ఈ ముర్రా జాతి దున్నలలో ప్రధానంగా 5 రకాలుంటాయి. వాటిలో హైదరాబాద్‌ షెహెన్‌షా, రుస్తుం, యువరాజు, ట్రంప్‌ దూడ, మహారాజ మొదలగువాటిని సదర్‌కు ముస్తాబు చేస్తారు. పండుగ రోజు యువకులు తీన్మార్‌ డాన్స్‌ల తో హోరెత్తిస్తారు.

సదర్ పండగను దృష్టిలో పెట్టుకొని దున్నపోతులను పెంచుతారు. అవి దృఢంగా ఉండడంకోసం కొన్ని నెలలపాటు వాటికి పోషక విలువలు కలిగిన తవుడు, దాన, గానుగ, పచ్చగడ్డి, కుడితి వంటివి పెడుతారు. పండగకు వారం ముందుగానే అలంకరణ ప్రారంభిస్తారు. దున్నపోతు శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించి నల్లగా నిగనిగలాడేలా తయారు చేస్తారు. అందుకు వెన్న లేదా పెరుగు ఉపయోగిస్తారు. కొమ్ములను రంగురంగుల రిబ్బన్లతో చుడతారు. నెమలి ఈకలను అమర్చుతారు. అలంకరించిన తరువాత సుగంధ ద్రవ్యాలను చల్లుతారు.

Here's Some Visuals on Sadar Festival Celebrations 

ఈ దున్నల ఖరీదు సుమారుగా రూ.15 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఉంటుంది. వీటికి ప్రతిరోజూ 50 లీటర్ల పాలు, వందల సంఖ్యలో ఆపిల్‌, బాదం, పిస్తా, కాన్బెర్రా, బ్లూబెర్రీ ఆహారంగా ఇస్తారు. వైన్‌, విస్కీ కూడా వీటికి తాగిస్తారు. ఒక్కోదానికి నలుగురు సంరక్షకులు ఉంటారు. ప్రతిరోజూ రెండు సార్లు స్నానం చేయిస్తారు! ఒక మనిషికి అవసరమైనట్లుగా వీటికి కూడా ప్రత్యేక గది, అందులో ఫ్యాన్‌ ఉంటుంది. రోజుకు రెండు సార్లు ఆయిల్‌ మసాజ్‌ చేస్తారు. పండుగకు వారం ముందుగానే అలంకరణ ప్రారంభిస్తారు.

దీపావళి శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్స్, దివాళి వాట్సాప్ స్టేటస్ కోట్స్, బంధువులకు, మిత్రులకు ఈ మెసేజెస్ ద్వారా దీపావళి విషెస్ చెప్పేయండి

పండగకోసం అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పడతారు. ముక్కుతాడును చేతబట్టు కొని అదుపు చేస్తారు. ఈ క్రమంలో దున్నపోతు తన ముందరి కాళ్లను పెకెత్తి యువకుడిపైకి ఉరికి వస్తుంది. అయితే భారీ శరీరం కావడం వలన అది తప్పించుకుపోయే అవకాశం ఉండదు. కొన్నింటిని సుతారంగా గంగిరెద్దులా ఆడించే ప్రయత్నం చేస్తారు. ఎంపిక చేసిన ఆవరణలో గానీ, ఖాళీ ప్రదేశంలో గానీ, బస్తీల్లో గానీ ఈ వేడుకలను నిర్వహిస్తారు. యువకులు, మహిళలు, విద్యార్థులు అంతా ఈ ఉత్సవాలను చూసేందుకు అమిత ఆసక్తిని కనబరుస్తారు. యువకులు తీన్మార్‌ డాన్స్‌లతో హోరెత్తిస్తారు.

దీపావళి విషెస్ వీడియో, దీవాళి శుభాకాంక్షలు తెలిపే వాట్సప్ స్టేటస్ వీడియో మీ కోసం, లేటెస్ట్‌లీ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

పురాణాలు, ఇతిహాసాల ప్రకారం యాదవ కుల స్తులు తమను శ్రీకృష్ణుని వారసులుగా చెప్పుకుంటారు. శ్రీకృష్ణుడు ఆలమందలను (పశువుల సంపద) పెంచి పోషించాడు. మానవ జీవితంలోనూ కొన్ని సామాజిక తరగతులకు, కులాలకు పశువులను పెంచడం ఒక వృత్తిగా మారింది. యాదవ కులస్తులూ పశుసంపదను పెద్ద ఎత్తున కలిగి ఉంటారు. తమ వృత్తి నుండి ఆవిర్భంచిన ఉత్సవం నేడు క్రమంగా సదర్‌ ఉత్సవంగా ఆదరణ పొందుతున్నది.

 Visuals on Sadar Festival Celebrations 

అప్పటి వ్యాపార సముదాయాల్లో బియ్యం, పప్పు దినుసులు, ఆల మందలు మొదలైనవాటికి బాగా విలువ ఉండేది. డబ్బు ఉండేది కాదు. దీనికి బదులుగా వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. అప్పట్లో పశువులకు మంచి డిమాండ్‌ ఉండటం వల్ల ఒకచోట నుంచి మరోచోటికి ఈ వస్తువు మార్పిడి జరిగేది. ఆ రోజుల నుంచి కాలక్రమేణా నాణేల మార్పిడి వరకు ముఖ్యమైన ప్రదేశాల్లో వ్యాపార సముదాయాల లావాదేవీల కేంద్రాలను సదరు అని పిలిచేవారు. అలా అది సదర్‌ ఉత్సవంగా మారిందని చరిత్రను బట్టి తెలుస్తోంది.

దీవాళి శుభాకాంక్షలు తెలిపే వీడియో, దీపావళి విషెస్ తెలిపే వాట్సప్ స్టేటస్ వీడియో మీ కోసం, లేటెస్ట్‌లీ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

సదర్‌ను స్వర్గీయ సలంద్రి న్యాయం చౌదరి మల్లయ్య యాదవ్ (Late Sri Salandri Nyayam Chowdhary Mallaiah Yadav) 1946లో హైదరాబాద్‌లోని నారాయణగూడ YMCAలో (Naryanguda YMCA) ప్రారంభించారు. కాలక్రమేణా హైదరాబాద్‌లోని అనేక ఇతర ప్రాంతాలలో సదర్‌లను వారి సంబంధిత చౌదరి నిర్వహించినప్పటికీ, నారాయణగూడ YMCA సదర్ (రెడ్డి మహిళా కళాశాల సమీపంలో) దాని చరిత్ర, ప్రజాదరణ కారణంగా అత్యధిక మందిని ఆకర్షిస్తుంది. అందుకే పెడ సదర్ అంటారు. నారాయణగూడ YMCA సదర్ 1946 నుండి ఇప్పటి వరకు దాని వ్యవస్థాపకుడు స్వర్గీయ సలంద్రి న్యాయం చౌదరి మల్లయ్య యాదవ్, ఆయన మరణం తరువాత అతని కుటుంబ సభ్యులచే ఏటా నిరంతరాయంగా నిర్వహించబడింది. దీపక్ టాకీస్, సైదాబాద్, అమీర్‌పేట్, ఖైరతాబాద్ సదర్ నిర్వహించబడే ఇతర ముఖ్యమైన ప్రదేశాలు.



సంబంధిత వార్తలు