Hyderabad November 05: సదర్ పండుగకు సిటీ రెడీ అయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సదర్ వేడుక కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా జరిపే వేడుకలకు హైదరాబాద్ ప్రసిద్దిగాంచింది.
కాచిగూడ, నారాయణగూడ, ఖైరతా బాద్, సైదాబాద్, బోయిన్‌పల్లి, ఈస్ట్ మారేడ్ పల్లి, చప్ప ల్ బజార్, మధురాపురి, కార్వాన్, నార్సింగి, ఓల్డ్‌సిటీ తదిరత ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సదర్‌లో ఖైరతాబాద్ చెందిన రూ. 30 కోట్ల విలువైన షారూఖ్, రూ. 25 కోట్ల లవ్రాణా, రూ. 16 కోట్ల విలువైన కింగ్,సర్తాజ్ నారాయణగూడలో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతిఏటా నారాయణగూడలో జరిగే సదర్ హైలెట్ గా ఉంటుంది. ఈసారి అంతకు మించి ఖైరతాబాద్ లో నిర్వహించేందుకు పోటీ పడి ఏర్పాట్లు చేస్తున్నారు. చూసేందుకు వేలాదిమంది జనాలు వచ్చే అవకాశం ఉంది.
సిటీలో సదర్ వేడులకు పంజాబ్, హర్యానాల నుంచి భారీ దున్నపోతులను తీసుకొచ్చారు. సదర్ పండగను దృష్టిలో పెట్టుకొని వీటిని ముందుగానే రప్పించారు. ఇవి ఫిట్నెస్గా ఉండేందుకు కొన్ని నెలల పాటు తవుడు, దాన, గానుగ, పచ్చగడ్డి, కుడితి తాపిస్తారు. ఇక్కడి వాతావరణానికి అలవాటైనంకా మెల్లగా డైలీ డజన్ యాపిల్స్, డ్రై ప్రూట్స్, ఒంట్లో వేడికోసం వీక్లి టూ టైమ్స్ జానీవాకర్, రెడ్లేబుల్ఆల్కాహల్ తాగిస్తారు. స్విమ్మింగ్‌ఫూల్‌లో స్నానం చేయించి ఆవనూనెతో మసాజ్ చేస్తారు. వీటిని చేసేందుకు ప్రత్యేకంగా వ్యక్తులుంటారు. డైలీ వీటి మెయింటెనెన్స్‌కు ఒక్కోదానికి రూ.10వేల వరకు ఖర్చవుతాయి. సదర్ పండగకు వారం ముందునుంచే అలంకరణ స్టార్ అవుతుంది.
దున్నపోతు మీద పెరిగిన వెంట్రుకలను తీసి నల్లగా నిగనిగలాడేలా చేస్తారు. ఈసారి ముషీరాబాద్ లో హర్యానా నుంచి రూ.16కోట్ల పెట్టి ప్రత్యేకంగా దున్నలను తీఉకొచ్చారు. ఈనెల 6న జరిగే సదర్‌లో వీటిని ప్రదర్శిస్తారు.
సిటీలో మొదటిసారిగా 1946లో సదర్ వేడుకలను చౌదరి మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. నిజాం కాలంలో గొల్ల, కురుమలు పశుసంపదపై ఎక్కువ ఇంట్రస్ట్ చూపించేవారు. తమ పశు సంపదను ప్రదర్శించడమే సదర్ వేడుక ప్రారంభానికి వేదికైంది. సదర్ వేడుకల్లో దున్నపోతుల విన్యాసాలు పిల్లలు, పెద్దలను ఆకట్టుకుంటాయి. యాదవులందరూ జోష్చేస్తారు.