దేశంలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. పెద్దలకు, పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండగల్లో ప్రధానమైన పండగ దీపావళి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ.
జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నిమ్పేదే దీపావళి . దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబం అంతా కలిసి జరుపుకునే వేడుకలు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, దీపాలను వెలిగించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగ దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీనిని దీవాళి అని దీపావళి అని కూడా పిలుస్తారు. ప్రజలు తమ ఇళ్లలో,దుకాణాలలో దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి, సంపద, అదృష్టం , శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.
దీపావళికి ముందు, ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు సానుకూలతను స్వాగతించడానికి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని ఈ పండుగ జరుపుకుంటారు. మరి అలాంటి పండుగకు మిత్రులకు, బంధువులకు విషెస్ చెబుతూ ఉంటారు. ఈ కోట్స్ తో మీరు కూడా మీ బంధువులకు విషెస్ చెప్పేయండి.
దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు.. సిరి సందపదలతో వర్థిల్లును మీ ఇల్లు.. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
మీ అందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు
చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి, ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు
అష్టైశ్వర్యాల నెలవు.. ఆనందాల కొలువు.. సర్వదా మీకు కలుగు.. – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ… దీపావళి శుభాకాంక్షలు
సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ..దీపావళి శుభాకాంక్షలు
కోటి కాంతుల చిరునవ్వులతో….. మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తూ…….. దీవాళి శుభాకాంక్షలు.
లేటెస్ట్‌లీ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.