Diwali and Deepavali 2021: దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటారు, దీనికి దీపాల పండుగ పేరు ఎలా వచ్చింది, హిందూ పురాణాల్లో దివాళి పండుగ చరిత్ర ఏమిటో ఓ సారి తెలుసుకుందాం
Diwali 2021 (File Image)

హిందువుల్లో తమ పండగలను కాలానికి అనుగుణంగా జరుపుకునే సంప్రదాయం ఉంటుంది. భారతదేశంలో జరుపుకునే పండుగలలో దీపావళికి (Diwali) విశిష్ట స్థానం ఉంది. ‘దీపావళి అంటే దీపముల వరస అని అర్ధం.. ఈ దీపాలు చీకటిని ప్రజలు వెలుగును ప్రసరింప చేస్తాయి. ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. హిందువుల పండుగలలో దీపావళి (Deepavali) ప్రత్యేకమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.

హిందూ పురాణాల ప్రకారం (History and significance) శ్రీరాముడు తన వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ... అయోధ్య ప్రజలు దీపావళిని జరుపుకున్నారట. ఈ ప్రవాస కాలంలో, అతను రాక్షసులతో మరియు లంక యొక్క శక్తివంతమైన పాలకుడైన రావణ రాజుతో పోరాడాడు. రాముడు తిరిగి వచ్చినప్పుడు, అయోధ్య ప్రజలు ఆయనను స్వాగతించడానికి మరియు అతని విజయాన్ని జరుపుకోవడానికి డయాస్ వెలిగించారు. అప్పటి నుండి, చెడుపై మంచి విజయాన్ని ప్రకటించడానికి దీపావళి జరుపుకుంటారు.

ధన్‌తేరస్ కు నాలుగు రోజుల ముందే మహా ముహూర్తం...60 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే...ఆ రోజు షాపింగ్ చేయాల్సిన వస్తువులు ఇవే...

మరొక పురాణం కథనం ప్రకారం రాక్షసుడైన నరకాసురుని వధించిన రోజుని నరక చతుర్ధశిగా.. మర్నాడు అమావాస్య రోజున దీపాలు వెలిగించి దీపావళిగా సంబరాలు జరుపుకున్నారట. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. అందిర ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకుంటారు.

పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.

అట్లతద్ది పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఎవరు జరుపుకుంటారు, అట్లతద్దె పండుగ చరిత్ర ఏమిటి, ఉయ్యాలపండగ రోజున ఏ పనులు చేయాలి, గోరింటాకు పండగపై ప్రత్యేక కథనం

దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవ దివస్‌గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే. ఈ రోజును యమ ద్వితీయ, భాయిదూజ్‌గా జరుపుకుంటారు. సోదరులు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి.

సూర్యభగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున. యమి తన సోదరుణ్ని ఎంతగానో అభిమానించేది. నిత్యమూ తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక సోదరికి ఇంటికి యుముడు వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దీనికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు.. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది... కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి అభ్యంగనస్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది.

పండుగ సాధారణంగా మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును ధంతేరాస్ అని పిలుస్తారు,