Surya Grahanam 2024: సూర్యగ్రహణం అక్టోబర్ 2 న కన్య రాశిలోకి సూర్యుడు కేతువు కలయికతో బుధాదిత్య యోగం ఈ మూడు రాశులు వారికి అదృష్టం.

ఈసారి సూర్యగ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది

Suryagrahan 2022 Representational Image (Photo Credits: Pixabay)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9:13 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ తెల్లవారుజామున 3:17 నిమిషాలకు ముగుస్తుంది. ఈసారి సూర్యగ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది. సూర్యగ్రహణం కారణంగా కన్యా రాశిలోకి కేతువు ,సూర్యుడు కలయిక ఉంటుంది. దీని కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది .ఇది ఈ సంవత్సరం ఏర్పడే సూర్యగ్రహణం దీని కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభరాశి- సూర్యుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వీరి జీవితాల్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. దీని కారణంగా వారి జీవితాలలో విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు సులువుగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. వ్యాపార పరంగా అనేక లాభాలు వస్తాయి. దీని ద్వారా మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది నూతన గృహాన్ని కొనుగోలు చేయాలనే కళ నెరవేరుతుంది.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి

మేషరాశి- ఈ రాశి వారికి సూర్యగ్రహణం నుండి అనేక శుభ ఫలితాలు జరుగుతాయి. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగిలిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పని చేసే చోట పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగాలలో ప్రమోషన్ లభిస్తుంది మీరు మీ లక్ష్యాలను త్వరగా పూర్తిచేస్తారు. విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.

తులారాశి- సూర్యగ్రహణం వల్ల తులా రాశి వారికి సానుకూల ప్రభావాలు ఉంటాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం స్నేహితులతో గడుపుతారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టులో పెండింగ్లో ఉన్న ఆస్తి వివాదాలు తొలగుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి బహుమతులు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. విదేశాల్లో మీ వ్యాపారానికి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif