Telugu Hanuman Jayanthi 2022: తెలుగు హనుమాన్ జయంతి, పవిత్రమైన ఈ రోజున నేలపైనే నిద్రిస్తే చాలా మంచిది, భక్తులందరూ ఈ రోజు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే..

కొన్ని ప్రాంతాల్లో ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు.

file

హిందూ క్యాలెండర్ ప్రకారం, హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే మే 25వ తేదీన అంటే బుధవారం రోజున మన తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి (Telugu Hanuman Jayanti 2022) వేడుకలను జరుపుకోనున్నారు.

కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి వేడుకలను (Telugu Hanuman Jayanthi) నిర్వహిస్తారు. అదే విధంగా కార్తీక మాసంలోని క్రిష్ణ పక్షంలో చతుర్దశి రోజున కూడా ఈ పవన పుత్రుని జయంతి వేడుకలను జరుపుకుంటారు. రామాయణం ప్రకారం, శ్రీరామచంద్రునికి ఆంజనేయుడు అత్యంత విధేయుడు, విశ్వాసుడు, నమ్మిన బంటుగా ఉంటాడు. హనుమంతుడు శివుని అంశతో పుట్టాడని పండితులు చెబుతుంటారు. ఈ పవిత్రమైన రోజున చేయాల్సిన పనులేంటి అనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పవిత్రమైన రోజున (Happy Telugu Hanuman Jayanti) సూర్యోదయం సమయంలో ఆంజనేయుడిని ఆరాధించాలి. ఈరోజు హనుమాన్ భక్తులందరూ ప్రత్యేక ఉపవాసం పాటించాలి. హనుమాన్ జయంతి రోజున భక్తులందరూ కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఈ పవిత్రమైన రోజున నేలపైనే నిద్రించాలి. బ్రహ్మచర్యాన్ని కూడా అనుసరించాలి. శ్రీరాముడు, సీతాదేవి మరియు హనుమంతులను గుర్తు చేసుకోవడానికి మీరు బ్రహ్మ ముహుర్తాలలో మేల్కొంటారు. తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానం చేయాలి. అనంతరం పూజా మందిరంలో లేదా దేవాలయంలో హనుమంతుడికి పూజ చేయాలి. హనుమాన్ చాలీసాతో పాటు భజరంగీ మంత్రాలను పఠించాలి.

తెలుగు హనుమాన్ జయంతి, ఏడాదిలో రెండు సార్లు జరుపుకునే ఏకైక పండుగ, హనుమాన్ విజయోత్సవం గురించి ప్రత్యేక కథనం

ఆంజనేయుడు ఇప్పటికీ భూమిపై జీవిస్తున్నాడని, గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే ఆ దేవుడు చిరంజీవిగా ఉండటానికి దీవించబడ్డాడు. ఎవరైతే పవన పుత్రుడిని స్వచ్ఛమైన భక్తితో ఆరాధిస్తారో.. అలాంటి వారికి కష్టాల నుండి విముక్తి లభించడమే కాదు.. పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. మీ జీవితంలో ఆనందం మరియు శాంతి లభిస్తుంది. అంతే కాదు శని ప్రభావం ఉండే వారు కూడా.. ఆంజనేయుడిని ఆరాధిస్తే.. మంచి ఫలితాలను పొందుతారు.

హనుమాన్ జయంతి రోజు మీ రాశి ప్రకారం, ఆంజనేయుడికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకోండి, రాశి ప్రకారం నైవేద్యం పెడితే కోరిన కోరికలు తీరడం ఖాయం...

ఆంజనేయుని ఆశీర్వాదం పొందడానికి, హనుమాన్ జయంతి రోజున ఆ దేవునికి సువాసన గల నూనె, మరియు సింధూరాన్ని అర్పించాలి. ఈరోజున సుందరకాండ పారాయణం, రామలక్ష్మణ చరితం, భజరంగబళి పఠనం చేయాలి.శివుని అంశ, వాయు పుత్రుడు.. అర్జునుడికి ప్రియ సఖుడు.. శ్రీరామదాసుడు.. ఎర్రని కన్నులుగలవాడు.. అమిత విక్రముడు.. సాగరాన్ని దాటినవాడు.. లంకలో సీతమ్మ శోకాన్ని హరించినవాడు.. సంజీవని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు.. పది తలలున్న రావణుని గర్వం అణచినవాడు, ఈ హనుమంతుని నామాలు ప్రయాణం సమయంలో, నిద్రపోయే ముందు స్మరించిన వారికి చావు గురించి భయం ఉండదు. వీరికి సర్వత్రా విజయం లభిస్తుంది.

హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు అస్సలు చేయవద్దు, లేకుంటే వీరాంజనేయుడి ఆగ్రహానికి గురవుతారు...

కలౌ కపి వినాయకౌ' అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుళ్లని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో.. అక్కడ ఆంజనేయుడు కచ్చితంగా ఉంటాడని భక్తుల నమ్మకం. ‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం - తత్ర తత్ర క్రుతమస్తాకాంజిలమ్, బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్' అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన హనుమంతునికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అని అర్థం.