Image Source : QUORA

హిందూ క్యాలెండర్ ప్రకారం, హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే మే 25వ తేదీన అంటే బుధవారం రోజున మన తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి (Telugu Hanuman Jayanti 2022) వేడుకలను జరుపుకోనున్నారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. అదే విధంగా కార్తీక మాసంలోని క్రిష్ణ పక్షంలో చతుర్దశి రోజున కూడా ఈ పవన పుత్రుని జయంతి వేడుకలను జరుపుకుంటారు. రామాయణం ప్రకారం, శ్రీరామచంద్రునికి ఆంజనేయుడు అత్యంత విధేయుడు, విశ్వాసుడు, నమ్మిన బంటుగా ఉంటాడు. హనుమంతుడు శివుని అంశతో పుట్టాడని పండితులు చెబుతుంటారు.

ఈనేపథ్యంలో హనుమంతుడు ఎప్పుడు జన్మించాడు ? ఆంజనేయుడి జయంతి (Telugu Hanuman Jayanti ) ఏ రోజు జరుపుకోవాలి ? చాలా మందిలో ఈ సంశయం నెలకొంది. సీతా, లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడి వసవాసం.. సీతాపహరణం, లంకా దహనం, వారది నిర్మాణం, రావణ సంహారం ఇలా రామాయణ ఘట్టాలు మనకు తెలిసినవే. సీతా దేవిని రావణుడు అపహరించాకా.. శ్రీరాముడు శోకభరితుడవుతాడు. ఆయన దుఃఖాన్ని నివారించేందుకు సముద్రాన్ని లంఘించిన హనుమంతుడు.. సీతా దేవి జాడ కనిపెడతాడు. ఆ తర్వాత వాహనులతో లంకపై దండెత్తిన శ్రీరాముడు.. రావణుడిని వధించి సీతాదేవికి తిరిగి పొందుతాడు. సీతారాములు తిరిగి అయోధ్య చేరుకున్నాకా..లంకలో రావణుడిపై విజయానికి ఆంజనేయుడే కారణమని ప్రకటించి.. హనుమాన్ విజయోత్సవం నిర్వహించాడట. ఆ రోజు చైత్ర పౌర్ణమి. అందుకే అప్పటి నుంచి హనుమాన్ విజయోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. అయితే అదే కాల క్రమంలో హనుమాన్ జయంతిగా మారిందంటున్నారు.

హనుమాన్ జయంతి రోజు మీ రాశి ప్రకారం, ఆంజనేయుడికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకోండి, రాశి ప్రకారం నైవేద్యం పెడితే కోరిన కోరికలు తీరడం ఖాయం...

మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. చైత్ర పౌర్ణమి రోజున ఆంజనేయుడు అసుర సంహారం చేశాడనీ.. అందుకే ఆ రోజు వేడుకలు జరుపుకుంటారని చెబుతారు. వైశాఖ బహుళ దశమి నాడు అంజనా దేవీ గర్భాన ఆంజనేయుడు జన్మించాడని పరాశర సంహిత చెబుతోంది. కేసరి, అంజనా దేవిల కుమారుడిగా... శివాంస సంభూతుడిగా జన్మించాడు. సప్త చిరంజీవుల్లో ఆయన ఒకరు. ఇప్పుటికీ మారుతి జీవించే ఉన్నాడని శాస్త్రాలు చెబుతాయి. రామభక్తులడైన అంజనా పుత్రుడు భక్త సులభుడంటారు. భక్తితో రామనామ జపిస్తే చాలు.. ఆంజనేయుడు ప్రసన్నుడవుతాడు. యత్ర యత్ర రఘునాధ కీర్తనం – తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ అని పెద్దలు చెబుతారు. అంటే రామ కీర్తన జరిగే చోట హనుమంతుడు అంజలి జోడించి ఉంటాడు.

హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు అస్సలు చేయవద్దు, లేకుంటే వీరాంజనేయుడి ఆగ్రహానికి గురవుతారు...

చైత్ర పౌర్ణమి మొదలుకొని వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల పాటు కొందరు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. 1, 5, 11, 41 ఇలా వీలైన సంఖ్యను ఎంచుకుని సంకల్పం చెప్పుకుని పారాయణ చేస్తే అనుకున్న కార్యాలు నెరవేరతాయని నమ్మకం. ఇక హనుమాన్ జయంతి (Hanuman Jayanti 2022) నాడు ... షోడశోపచార పూజలతో ఆంజనేయుడిని అర్చిస్తే సమస్త శుభాలు కలుగుతాయి, శని బాధలు తొలగిపోతాయి. మారుతికి అరటి పండ్లు, అప్పాలు అంటే మిక్కిలి ఇష్టం. వాటిని నివేదిస్తే అమితానందభరితుడవుతాడు.