Image Source : QUORA

Hanuman Jayanti 2022: ఈ సంవత్సరం ఏప్రిల్16న హనుమాన్ జయంతి వస్తుంది. వాస్తవానికి చాలామంది మంగళవారం రోజున హనుమంతుడిని ఆరాధిస్తారు. అయితే హనుమాన్‌ జయంతి రోజున చేసే పూజకి చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం చేస్తూ భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ని ఆరాధిస్తారు. హనుమాన్ జయంతి రోజు కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల మీ ఇంటి కష్టాలను తొలగించుకోవచ్చు. అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

>>  మీరు డబ్బు సమస్యలని ఎదుర్కొంటున్నట్లయితే హనుమాన్‌ని ఆరాధించండి. చిటికెడు సింధూరం నెయ్యిలో నానబెట్టి పేస్ట్‌లా తయారు చేసి కాగితంపై స్వస్తిక్‌ గుర్తును తయారు చేయండి. ఈ స్వస్తిక్‌ని హనుమాన్‌ హృదయంపై ఉంచండి. హనుమాన్ జయంతి రోజు చేసే ఈ పరిహారం డబ్బు లోటును పోగొడుతుంది.

>>   వివాహం కావడంలో ఆలస్యం జరిగితే అమ్మాయిలు, అబ్బాయిలు చిటికెడు సింధూరం తీసుకొని హనుమాన్ పాదాల వద్ద ఉంచండి. హనుమాన్ జయంతి రోజు చేసే ఈ పరిహారం వల్ల తొందరగా వివాహం అవకాశాలను కలిగిస్తుంది.

>>   ఇంట్లో నెగిటివ్‌ శక్తి ఉందని అనిపిస్తే తొలగించడానికి సింధూరం నివారణను పాటించండి. పచ్చిమిర్చి తీసుకుని అందులో ఆవాలనూనె కలిపి పేస్టులా చేయాలి. దానిని హనుమాన్ దగ్గర పెట్టి కొద్దిసేపటి తర్వాత ఆ పేస్ట్‌ని అన్ని గదుల గేటు దగ్గర పెట్టాలి. అంతా శుభం జరుగుతుంది.

>>   ఉద్యోగంలో ప్రమోషన్ పొందడంలో సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే సింధూరం నివారణను పాటించండి. మల్లె నూనెలో సింధూరం కలిపి కాగితంపై స్వస్తిక్‌ చేయండి. ఈ స్వస్తిక్‌ని హనుమాన్ జీకి సమర్పించిన తర్వాత దానిని జేబులో లేదా పర్సులో పెట్టుకోండి. మంచి జరుగుతుంది.