Women's Day 2022: యూట్యూబ్ లో వైరల్ అవుతున్న యోగితా సతావ్ యాడ్, 35 కిలో మీటర్లు బస్సు డ్రైవ్ చేసి డ్రైవర్ ప్రాణాలు కాపాడిన మహిళ..

డ్రైవ్‌లైక్ఏలేడీ (#DriveLikeALady) అనే హ్యాష్‌టాగ్‌తో యాడ్‌ను రూపొందించి యూట్యూబ్‌లో షేర్ చేసింది. దీంతో ఆ యాడ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు మ‌రోసారి యోగితాను గుర్తు చేసుకొని త‌ను చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.

Image : Youtube

Women's Day 2022: గ‌త జ‌న‌వ‌రిలో పూణెకు చెందిన యోగితా స‌తావ్ (The Story of Yogita Satav)  సోష‌ల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. దానికి కార‌ణం.. త‌ను చేసిన సాహ‌సం.. త‌న ధైర్యం. యోగితా స‌తావ్‌.. తొలి సారి బస్సు స్టీరింగ్ ప‌ట్టుకొని.. బ‌స్సు న‌డిపి డ్రైవ‌ర్ ప్రాణాల‌ను కాపాడింది. స‌కాలంలో డ్రైవ‌ర్‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గ‌లిగింది.

జ‌న‌వ‌రి 7న మినీ బ‌స్సులో యోగిత‌తో పాటు మ‌రో 20 మంది మ‌హిళ‌లు పిక్‌నిక్ వెళ్లారు. బ‌స్సు డ్రైవ్ చేస్తూ.. డ్రైవ‌ర్ స్పృహ కోల్పోయాడు. దీంతో వెంట‌నే ప్ర‌మాదం గ‌మ‌నించిన యోగిత‌.. బ‌స్సు స్టీరింగ్ ప‌ట్టుకొని బ‌స్సును డ్రైవ్ చేసి.. స‌కాలంలో బ‌స్సును ఆసుప‌త్రి ద‌గ్గ‌రికి వెళ్లేలా చేసింది. దీంతో ఆ బ‌స్సు డ్రైవ‌ర్ ప్రాణాలకు ఎటువంటి ప్ర‌మాదం ఏర్ప‌డ‌లేదు.

అయితే.. అప్ప‌టి వ‌ర‌కు త‌ను ఏనాడూ బ‌స్సు న‌డ‌ప‌లేదు. కానీ.. డ్రైవ‌ర్ ప్రాణాలు ప్ర‌మాదంలో ఉన్నాయ‌ని తెలుసుకొని త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో 35 కిలోమీట‌ర్లు బ‌స్సు న‌డిపింది. త‌న గురించి తెలుసుకొని అప్పుడు చాలామంది త‌న‌ను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు.

తాజాగా కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ యోగితను స్ఫూర్తిగా తీసుకొని జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ కోసం కొత్త యాడ్‌ను రూపొందించింది. డ్రైవ్‌లైక్ఏలేడీ (#DriveLikeALady) అనే హ్యాష్‌టాగ్‌తో యాడ్‌ను రూపొందించి యూట్యూబ్‌లో షేర్ చేసింది. దీంతో ఆ యాడ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు మ‌రోసారి యోగితాను గుర్తు చేసుకొని త‌ను చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.