Tholi Ekadasi 2022: రేపే తొలి ఏకాదశి, ఈ రోజు ఈ తప్పులు చేశారో జీవితాంతం పేదరికంలో గడపాల్సిందే, తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే..

ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు.

(Rep. Image)

ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొవడమే ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి చాతుర్మాస దీక్ష చేస్తారు. చాతుర్మాస్య దీక్ష చేపట్టినవారు నాలుగు నెలలపాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో ఉంటారు.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శ్రీమహా విష్ణువును నిష్ఠతో పూజించాలి. పూజ గదిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. ఈ రోజు చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి.

తొలి ఏకాదశి వ్రతం చేసేవారు. మాంసాహారం, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి, వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు. అలాగే మంచంపై పడుకోకూడదు. తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి, అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశి నాడు పశువులను పూజించాలి.

తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి:

ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, అలాగే రాత్రి పూట జాగరం చేయాలి. రాత్రివేళ భజనలు, భాగవత పారాయణం, విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.. మర్నాడు ద్వాదశి రోజున దేవాలయానికి వెళ్లి ఉపవాసం విరమించాలి. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలి. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif