Spring 2020: వచ్చేసింది నవవసంతం, ఆమని ఆగమనంతో కిలకిల రాగాలు పలుకుతోంది లోకం. వసంత రుతువు ప్రారంభమైన సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్
ఆ తర్వాత వసంతం వేసవిగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, పగటి కాలం ఎక్కువ మరియు రాత్రులు తక్కువ అవుతాయి....
Vasantha Ruthuvu 2020: వసంత రుతువు ఆగమనంతో పుడమి సరికొత్త రంగులను పులుముకొంది. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరంను ఆరు రుతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వసంత రుతువు. రుతువుల రాణిగా చెప్పబడే వసంతకాలంలో చెట్లు కొత్తగా చిగురిస్తాయి, పువ్వులు వికసిస్తూ పరిమళాన్ని వెదజల్లుతాయి. ప్రకృతి పులకరింతతో జీవరాశికి ఈ కాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉగాది పండగ ఈ రుతువుతో ఆరంభం అవుతుంది. అదే హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాస ఆరంభాన్ని సూచిస్తుంది.
ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం మార్చి 20న, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే వసంత కాలం జూన్ 21 వరకు ఉంటుంది. గత 124 సంవత్సరాలలో వచ్చిన వసంత కాలాలతో పోలిస్తే ఈ 2020 లో వసంతం ముందే వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి.
ఆమని ఆగమనాన్ని పురస్కరించుకొని గూగుల్ ప్రత్యేక డూడుల్ తో వేడుకలు ప్రారంభించింది. నీలం, ఆకుపచ్చ మరియు గోధుమ లాంటి ఇంపైన ప్రకృతి రంగులతో 2020 వసంతకాలం కోసం గూగుల్ డూడుల్ సృష్టించబడింది. 'హాట్ ఎయిర్ బెలూన్' ద్వారా వెచ్చదనాన్ని సూచిస్తూ దానిపై ఆకులు, పువ్వులు మరియు నీటి బిందువులతో వివరించబడింది, గాల్లో తేలుతూ ఉన్నటు వంటి ఒక అందమైన బన్నీ కుందేలు దాని నుండి బయటకు చూపించడం ద్వారా ఆరంభమైంది ఆహ్లాదకరమైన కాలం అని గూగుల్ డూడుల్ సూచిస్తుంది.
వసంత కాలం నాలుగు సమశీతోష్ణ కాలాలలో భాగం. ఈ సీజన్, వాస్తవానికి, పునరుజ్జీవనం, పునరుద్ధరణ మరియు పెరుగుదల ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. అలాగే ఇది వేడి వేసవి కాలం ప్రారంభమయ్యే కాలానికి సూచిక.
వసంత రుతువు సమయంలో, పగలు మరియు రాత్రులు దాదాపు సమానంగా 12 గంటలు ఉంటాయి. ఆ తర్వాత వసంతం వేసవిగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, పగటి కాలం ఎక్కువ మరియు రాత్రులు తక్కువ అవుతాయి.