Vastu Tips: ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదా, అప్పుల బాధ వేధిస్తోందా, అయితే ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేస్తుంది...

ఉండే ఇల్లు, ఆఫీస్ వాస్తుకు అనుగుణంగా నిర్మించడం ద్వారా ఇలాంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.

(Photo Credit: social media)

ఎంత సంపాదించినా చేతిలో నిలవకుండా అప్పులు చేసే వారికీ కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉండే ఇల్లు, ఆఫీస్ వాస్తుకు అనుగుణంగా నిర్మించడం ద్వారా ఇలాంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఇలా వాస్తు అనుగుణంగా మనం ఉండే ఇల్లు, మన వ్యాపారం చేసే షాప్ ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. అలా పాటించాలంటే ఏ వస్తువు ఏ దిశలో ఉండకూడదో తెలుసుకుందాం.

Agnipath Scheme Row: అసలేం జరిగింది..సికింద్రాబాద్‌లో అగ్గి రాజేసిందెవరు, అదుపు తప్పిన యువకులతో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, క్షణాల్లో రైల్వే స్టేషన్ అంతటా దట్టమైన మంటలు 

>> తూర్పు ఆగ్నేయ దిశలో వాస్తు పాటించక పోతే నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయట. అంతేకాదు ఆందోళనలు పెరుగుతాయి. అందుకే ఈ దిశలో మీరు మిక్సర్, గ్రైండర్ పెట్టుకోవడం వల్ల మీకు కలిసి వస్తుంది.

>> ఈశాన్యంలో మరుగుదొడ్డి, చెత్తకుండీ, చీపురు వంటి వస్తువులు అస్సలు పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల మీరు అప్పుల ఊబిలో కురుకుపోతారని వాస్తు శాస్త్రం చెబుతుంది.

>> ఇక వాస్తు ప్రకారం దక్షిణ నైరుతి పశ్చిమ దిశా వృధా ఖర్చులకు సూచనా. మీరు ఈ ప్లేస్ లలో నిద్రపోయినా లేదంటే మీ ఇంటి ద్వారం ఈ ప్లేస్ లో ఉన్న మీరు అప్పుల పాలు అవుతారని చెబుతుంది వాస్తు శాస్త్రం.

>> ఇంకా ఉత్తర దిశ అవకాశాలకు వారధి లాంటిది. ఆగ్నేయ దిశా నగదు ప్రవాహానికి వారధి.

>> ఉత్తర దిశలోని గోడలకు ఎరుపు రంగు వేయడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుందట.

>> అలానే ఆగ్నేయ దిశలో నీలం రంగు వేస్తె మీ నగదు ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.

>> కాబట్టి ఈ దిశల్లో ఈ రంగులు వేయకుండా జాగ్రత్త తీసుకోండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఆర్ధిక సమస్యలు లేకుండా కాపాడుకోండి.