Diwali 2024: దీపావళి రోజు ఈ ప్రమిదలో దీపం వెలిగిస్తే మీకు శుభం కలుగుతుంది, పండితులు ఏమి చెబుతున్నారంటే..

నరకాసురుడనే రాక్షసుడు అంతమై పీడ విరగడైందన్న ఆనందంలో ప్రజలు దీపావళి సంబరాలు చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండగ రోజున దేశవ్యాప్తంగా ప్రతి ఇల్లూ దీపపు కాంతులతో వెలిగిపోతుంది.

diwali

హిందూవుల ముఖ్య పండుగ దీపావళి ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది.  నరకాసురుడనే రాక్షసుడు అంతమై పీడ విరగడైందన్న ఆనందంలో ప్రజలు దీపావళి సంబరాలు చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండగ రోజున దేశవ్యాప్తంగా ప్రతి ఇల్లూ దీపపు కాంతులతో వెలిగిపోతుంది.దీపావళి రోజు పూజా మందిరంలో వెండి ప్రమిదలో దీపం వెలిగిస్తుంటారు. ఇంటి ముందు భాగంలో మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తుంటారు. అయితే శాస్త్ర ప్రకారం.. ఒక్కొ ప్రమిదలో ఒక్కో దీపం వెలిగిస్తే ఒక్కో రకమైన ప్రయోజనం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.

బంగారు ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పిల్లలకు చదువు బాగా వస్తుందని, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో మెరుగైన ప్రతిభను కనబరుస్తారని వివరిస్తున్నారు. అలాగే ధన లాభం ఉంటుందని, బంగారం కొనుగోలు చేసే శక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

అక్టోబర్ 31 వ తేదీనా నవంబర్ 1తేదీనా, దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, పండితులు ఏమి చెబుతున్నారంటే..

వెండి ప్రమిద: పూజ గదిలో వెండి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఇంటి యజమానికి అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుందని తెలుపుతున్నారు.

రాగి ప్రమిద: ఇంటి ముందు రాగి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే మనోధైర్యం పెరుగుతుందని చెబుతున్నారు.

కంచు ప్రమిద: కంచు ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఇంటి ముందు దీపం వెలిగిస్తే ధనానికి స్థిరత్వం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మట్టి ప్రమిద: ఇక మట్టి ప్రమిదలో దీపం వెలిగించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Note: పైన తెలిపిన కథనం కొందరు జోతిష్య నిపుణులు, జోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. లేటెస్ట్‌లీ బాధ్యత వహించదు