Diwali-Greetings

హిందూవుల ముఖ్య పండుగ దీపావళి ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా చేసుకుంటారు. ఈ సారి దీపావళి అక్టోబర్ 31నా? లేక నవంబర్ 1వ తేదీనా? అనేదానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది. దీనికి కారణం ఈ ఏడాది అమావాస్య ఘడియలు అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో విస్తరించి ఉండటమే.. దీనిపై పండితులు ఏమంటున్నారంటే..

ఈసారి అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వచ్చాయని.. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభం అవుతుందని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 31 గురువారం రాత్రి మొత్తం అమావాస్య వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఆరోజున దీపావళి జరుపుకోవాలని తెలుపుతున్నారు.

శ్రీకృష్ణుడు 16 వేల మంది గోపికలను ఎందుకు పెళ్ళి చేసుకున్నాడో తెలుసా ? పురాణాల కథనం ఇదిగో..

అమావాస్య ఘడియలు అక్టోబర్​ 31 మధ్యాహ్నం నుంచి నవంబర్ 1 శుక్రవారం రోజు సాయంత్రం 6.15 వరకు ఉన్నా.. ఆ రోజు దీపావళి జరుపుకోకూడదని పండితులు చెబుతున్నారు.   దీపావళి సాయంత్రానికి అమవాస్య తిథి ఉండటమే ముఖ్యకారణం. ఈ ఏడాది శుక్రవారం రాత్రి పూట అమావాస్య వ్యాపించి లేనందున నవంబర్​ 1వ తేదీన దీపావళి జరుపుకోకూడదని చెబుతున్నారు.అక్టోబర్ 31న గురువారం సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉండడంతో ఆ రోజునే ఉదయం నరక చతుర్థశి జరుపుకోవాలని.. సాయంత్రానికి అమావాస్య తిథి వస్తుండడంతో అదే రోజు రాత్రి దీపావళి జరుపుకోవాలని చెబుతున్నారు.

Note: పైన తెలిపిన కథనం కొందరు జోతిష్య నిపుణులు, జోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. లేటెస్ట్‌లీ బాధ్యత వహించదు