Varalaxmi Vratham: కోరిన కోర్కెలు తీర్చే వరమహాలక్ష్మి కటాక్షం పొందండి.. ఆ శ్రీదేవి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి తరించండి.. దేవదేవేరీ సౌభాగ్య చిత్రమాలిక మీకోసం..

ఈ పర్వదినం రోజున సోషల్ మీడియాలో పలువురు ఆ మహాలక్ష్మి హెచ్ డీ ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు.. వాటిపై ఓ లుక్ వేయండి.

Varalakshmi Devi (Photo Credits: Twitter)

Hyderabad, August 5: ప్రతి శ్రావణ రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం (Varalaxmi Vratham) ఆచరించడం ఆచారం. నేడు దేశవ్యాప్తంగా హిందువులు వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. వర మహాలక్ష్మి వ్రతం రోజు వ్రతాన్ని ఆచరించే మహిళలు కలశం ఏర్పాటు చేసి, అలంకరించి, లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి దేవుడికి నైవేద్యాన్ని సమర్పించిన అనంతరం సుమంగళికి పసుపు కుంకుమను సమర్పించి ఉత్సవం జరుపుకుంటారు.

నాగపంచమి విషెస్, కోట్స్, మీ బంధువులకు, స్నేహితులకు ఈ మెసేజెస్ ద్వారా విషెస్ చెప్పేయండి

వరలక్ష్మి దేవి భక్తులు (Devotees) కోరిన వరాలను ప్రసాదిస్తుందని , తన భక్తుల కోరికలను తీరుస్తుందని నమ్మకం. అందువల్ల ఈ దేవత రూపాన్ని వర అని , లక్ష్మి (Laxmi) లేదా లక్ష్మి వరాన్ని ఇచ్చే దేవత అని పిలుస్తారు. ఈ పర్వదినం రోజున సోషల్ మీడియాలో పలువురు ఆ మహాలక్ష్మి హెచ్ డీ ఫోటోలను (Photos), వీడియోలను (Videos) షేర్ చేశారు.. వాటిపై ఓ లుక్ వేయండి.