Food Tips: మినప్పప్పు లేకుండా అప్పటికప్పుడు టేస్టీ దోశలు సింపుల్ గా చేసుకోవడం ఎలా..
కానీ ఆ పిండిని ప్రిపేర్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ తో కూడి ఉంది. ఆ బ్యాటర్ ని రెడీ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.
దోశలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ ఆ పిండిని ప్రిపేర్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ తో కూడి ఉంది. ఆ బ్యాటర్ ని రెడీ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అటువంటి అప్పుడు దోసలు తినడానికి బయటకు వెళ్లాలని చూస్తూ ఉంటారు. అయితే ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు మనము దోశ పిండి లేకుండా కూడా దోసెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ సింపుల్ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు.
బియ్యప్పిండి ఒక కప్పు, గోధుమపిండి రెండు టీ స్పూన్లు, బొంబాయి రవ్వ, రెండు టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడనంత, చిటికెడు పంచదార, బేకింగ్ సోడా అర టీ స్పూను పెరుగు ఒక కప్పు.
Health Tips: ముల్లంగిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...
తయారీ విధానం- ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యప్పిండి గోధుమపిండి రవ్వ ఉప్పు కప్పు పెరుగు చిటికెడు పంచదార వేసి కలుపుకోవాలి. ఈ పిండిని దోస బాటర్ లాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు కాస్త పుల్లటి పెరుగు అయితే దోస రుచి కాస్త బాగుంటుంది. బేకింగ్ సోడా అనేది మీ ఆప్షనల్ గా వేసుకోవచ్చు. ఇందులో కావాలంటే కొద్దిగా అల్లం తురుము, ఉల్లిపాయ తురుము, కొత్తిమీర ,పచ్చిమిర్చి వంటివి కూడా వేసుకోవచ్చు. వీటిని కలుపుకొని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన దోస పెనాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపించిన బ్యాటర్ దోస లాగా వేసుకోవాలి. దీన్ని రెండు వైపులా కాల్చుకొని పల్లి చట్నీతో గాని కొబ్బరి చట్నీతో లేదా టమాటా చట్నీతో తింటే రుచి చాలా బాగుంటుంది. ఇనిస్టెంట్ గా తయారు చేసుకునే ఈ దోసలు బ్యాచులర్స్ కి చాలా మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి