Food Tips: తక్కువ టైంలో సింపుల్ గా టేస్టీగా చేసుకునే మరమరాల గారెలు.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..

అని సామెత ఊరికే రాలేదు అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది. అయితే దాన్ని చేసుకోవడానికి చాలా ఎక్కువ సమయం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు.

pixa bay

వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి. అని సామెత ఊరికే రాలేదు అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది. అయితే దాన్ని చేసుకోవడానికి చాలా ఎక్కువ సమయం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు. అయితే అలాంటిదేమీ లేకుండా కేవలం 15 నిమిషాల్లోనే చేసుకోగలిగే గారెల రెస్పిని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇందులో మినప్పప్పును నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా బ్యాచులర్స్ కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఉదయాన్నే టిఫిన్ కి కంగారు లేకుండా కూడా దీన్ని చేసుకోవచ్చు. చలికాలంలో సాయంత్రం పూట ఈ గారాలతో పాటు టీ కాంబినేషన్ ట్రై చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ స్పెషల్ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో మరి దానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు..

మరమరాలు రెండు కప్పులు, మంచినీరు రెండు కప్పులు, అల్లం తురుము కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు, పచ్చిమిర్చి ఒక నాలుగు, జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు పొడి ఒక టీ స్పూన్, ఉల్లిపాయ రెండు కొత్తిమీర ఒక రెండు కట్టలు బియ్యప్పిండి అర కప్పు పెరుగు అరకప్పు ఉప్పు తగినంత..

Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎప్పుడూ కూడా పచ్చిగా తినకూడదు ...

తయారీ విధానం- మరమరాల గారెలను చాలా ఈజీగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. చాలా త్వరగా చేసుకుని రెసిపీ ఇది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల మరమరాలను వేయాలి. ఇందులో రెండు కప్పుల నీరు వేసి కొద్దిసేపు నానబెట్టాలి .ఇప్పుడు ఇంకొక బౌల్లో కరివేపాకు, పచ్చిమిర్చి ,అల్లం తురుము, కొత్తిమీర, ఉల్లిపాయ తరం మిరియాల పొడి, జీలకర్ర, అన్నీ కూడా కలిపి పక్కన సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి.

మరమరాలు ఒక పది నిమిషాలు నానిన తర్వాత వాటిని నీరు లేకుండా గట్టిగా వంపేసుకొని గట్టిగా పిండుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరమరాల్లో నుంచి నీటిని తీసేసిన తర్వాత ఆ మరమరాల మిక్సింగ్ బౌల్ లోనికి చేతితో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నానబెట్టడం వల్ల ఇవి వెంటనే మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఇందాక పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఈ పిండిలో కలుపుకోవాలి. దీనిలో కాస్త పెరుగు బియ్యప్పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మరి గట్టిగా లేకుండా మరీ లూజ్ గా లేకుండా గారెలకు వీలయ్యే విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన పిండిని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.

స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని గారెల లాగా వత్తుకొని నూనెలో వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే గారెలు రెడీ అయినట్లే వీటిని మార్నింగ్ టిఫిన్ గా లేదా ఈవినింగ్ స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఎంత సింపుల్ గా ఉండే ఈ గారెలు చాలా ఈజీగా బ్యాచులర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి కొత్తిమీర చట్నీ లేదా పల్లి చట్నీ తయారు చేసుకొని ఉంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చలికాలంలో ఈ సాయంత్రం సమయంలో క్రిస్పీగా ఉండే ఈ గారెలు తక్కువ సమయంలోనే తయారు చేసుకొని టేస్టీగా తినొచ్చు.