Unique Restaurants: కళ్లను ఊరిస్తున్న రెస్టారెంట్లు. ఈ రెస్టారెంట్లను చూస్తే కనీసం ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లి భోజనం చేయాలనిపిస్తుంది
కొంతమంది రెస్టారెంట్ ఓనర్లు తమ క్రియేటివిటీని ఎలా వాడుతున్నారో చూడండి...
నోరూరుంచే రుచులను అందివ్వడమే కాదు, అందరి కళ్లను ఆకర్శించేలా చేస్తున్నాయి కొన్ని రెస్టారెంట్లు.
'కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు కానీ, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు' అన్నట్లుగా క్రియేటివిటీ ఉండాలే కానీ అది ఏ ప్లాట్ ఫాం అయినా మన టాలెంట్ చూపించవచ్చు. కొంతమంది రెస్టారెంట్ ఓనర్లు తమ క్రియేటివిటీని ఎంతలా వాడుతున్నారంటే తమ రెస్టారెంట్లలో రకరకాల ఫుడ్ వైరైటీలను పరిచయం చేయడమే కాకుండా. వివిధ రకాల థీమ్స్ తో, విభిన్నమైన కాన్సెప్ట్ (Unique Concepts) లతో తమ రెస్టారెంట్లను డెకరేట్ చేస్తూ జనాలను ఆకర్శిస్తున్నారు. ఇది ఒక మార్కెటింగ్ ఆర్ట్ . ఇండియాలో చాలా రెస్టారెంట్లు ఇప్పుడు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నాయి. తమ దగ్గరికి వచ్చే ఫుడ్ ప్రేమికులకు మంచి ఆతిథ్యం (Hospitality) అందివ్వడమే కాకుండా ఒక మంచి ఎక్స్ పీరియన్స్ ఉండేలా వారి రెస్టారెంట్లను, వడ్డించే విధానలను వైరెటీ వైరెటీ కాన్సెప్ట్ లతో తీర్చిదిద్దుతున్నారు. దీంతో చాలా మంది ఆ రెస్టారెంటుకు ఒక్కసారైనా వెళ్లి అక్కడ పరిసరాలు (Ambiance) చూస్తూ, ఫోటోస్ తీసుకుంటూ ఫుడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
Unique Restaurants- ఇండియాలో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ఆహార ప్రియులను ఆకర్శిస్తున్న కొన్ని రెస్టారెంట్లు.
Dialogue in the dark - హైదరాబాద్
ఈ రెస్టారెంట్ లో తినడం అంటే ఒక కొత్త ప్రపంచానికి వెళ్లి తింటున్నట్లే అనిపిస్తుంది. లోపలికి వెళ్లేటపుడు మొబైల్ ఫోన్లను కూడా తీసేసుకుంటారు. ఈ రెస్టారెంట్ లోపల పూర్తి గాఢాంధకారంతో ఉంటుంది. లోపల కనీసం చిన్న క్యాండిల్ కూడా ఉండదు, ఎవరికీ ఎవరూ కనిపించరు కూడా. మనం ఏం తింటున్నామో రుచి చూస్తే కానీ తెలియదు. అలాంటి సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయి. దీంతో తినేటపుడు మన దృష్టి ఎటూ మల్లేందుకు ఆస్కారం ఉండదు కాబట్టి రుచిని బాగా ఆస్వాదించవచ్చు, కపుల్స్ లేదా ఫ్యామిలీస్ తో వెళ్తే ఒకరొకొకరు మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. అందుకే ఈ రెస్టారెంట్ కు డైలాగ్ ఇన్ ద డార్క్ అనే పేరు పెట్టారు. విశేషం ఏంటంటే, ఇందులో వడ్డించే వారు సైతం చూపులేని వారే. బ్లైండ్ బట్ ట్రైన్‌డ్ అన్నమాట. ఫుడ్ ఐటెంస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయని, తమ లైఫ్ లో ఇదొక డిఫెరెంట్ ఎక్స్‌పీరియన్స్ అని ఇక్కడికి వెళ్లినవారు చెప్తారు.
70 MM- హైదరాబాద్
ఇది కూడా హైదరాబాద్ లోనే ఉంది. 70 ఎంఎం పేరు వింటే మనకు సినిమా టాకీస్ గుర్తుకొస్తుంది. ఇప్పుడంటే మల్టీప్లెక్స్ లు ఎక్కువయ్యాయి కానీ, నిన్నటి కాలంలో 70 ఎంఎం టాకీసులదే హవా. సరిగ్గా అలాంటి కాన్సెప్ట్ తోనే ఈ రెస్టారెంట్ డెకొరేట్ చేశారు. ఇందులోకి వెళ్తే ఒక సినిమాటిక్ ఫీలింగ్ కలుగుతుంది. గోడల మీద నిన్నటితరం హీరోలకు చెందిన సినిమా పోస్టర్లు ఉంటాయి. లోపల ఉండే ఒక పెద్ద స్క్రీన్ మీద పాత సినిమాలు కూడా ప్లే చేస్తారు. ఇక్కడికి వచ్చిన వారు సినిమా చూస్తూ, ఫుడ్ ఎంజాయ్ చెయ్యొచ్చు అన్నమాట.
Central Jail Restaurant - బెంగళూరు
గార్డెన్ సిటీ బెంగళూరులో ఎంజాయ్ చేయటానికి ఎక్కడా లేనన్ని పబ్ లు, ఎన్నోరకాల థీమ్స్ తో రెస్టారెంట్లు ఉంటాయి. ఆకాశంలో తినటానికి కేబుల్ రెస్టారెంట్లు కూడా పరిచయం చేశారు. ఇదిలా ఉంటే బెంగళూరులోని, జయనగర్ ఏరియాలో సెంట్రల్ జైల్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడికి వెళ్తే జైలుకు వెళ్లి జైలు కూడు తింటున్నట్లే అనిపిస్తుంది. లోపలంతా ఒక జైలు వాతావరణమే కనిపిస్తుంది. ఈ రెస్టారెంట్ కు వెళ్లగానే పోలీస్ డ్రెస్సులో ఉన్నవారు మీకు ఆహ్వానం పలుకుతారు, వారే మీ దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకుని, ఖైదీ బట్టలు వేసుకున్న వారికి మీ ఆర్డర్ తీసుకు రావాల్సిందిగా ఆదేశిస్తారు. ఆ తర్వాత ఖైదీ డ్రెస్సులో ఉన్నవారు మీకు కావాల్సింది వడ్డిస్తూ, మీకు సేవ చేస్తారు.
Black Pearl , బెంగళూరు.
మీరు పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సినిమా చూశారా? సముద్రంలో ఒక పెద్ద షిప్, అందులో దొంగలు పడటం ఆ నేపథ్యంలో ఉంటుంది. మన తెలుగులో పాత కౌబాయ్ సినిమాల లాగ అన్నమాట. ఈ రెస్టారెంట్ కు వెళ్తే మీరు ఆ లోకంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. ఇక్కడ వడ్డించేవారు సైతం దొంగల్లాగే ఉంటారు.
27 Culinary Street- చెన్నై
చెన్నైలోని ద్వారకా కాలనీలో ఈ రెస్టారెంట్ ఉంది. పాత అంబాసిడర్ కారును రెండుగా చీల్చి ఎదురెదురుగా పెడితే ఎలా ఉంటుందో ఇక్కడ కూర్చుండే సీట్లు అలాగే ఉంటాయి, పాత జీప్ లా మీ ముందు టేబుల్స్ ఉంటాయి. ఇదే తరహాలో ముంబైలోని 'ఫిరంగీ దాబా' అనే రెస్టారెంట్ ఉంది, అక్కడ ఆటోరిక్షాలను పెట్టారు. అంటే ఆటోరిక్షాలో కూర్చుండి తినడం అన్నమాట.
అలాగే చెన్నైలోని 'ఖైదీ కిచెన్' అనే రెస్టారెంట్ బెంగళూరులోని సెంట్రల్ జైల్ రెస్టారెంట్ సేమ్ కాన్సెప్ట్.
Recipes Train Restaurant - గువహటి
అస్సాంలోని గువహటిలో ఉన్న ఈ రెస్టారెంట్ ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఫుడ్ సెర్వ్ చేస్తుంది.
టేబుల్స్ పై అన్నీ రైల్వే ట్రాక్స్ కనిపిస్తాయి. దానిపై చిన్న సైజు రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. అంతేకాదు, మీరు ఏదైనా ఆర్డర్ ఇస్తే కొద్ది సేపటికి కిచెన్ నుంచి ఒక గూడ్స్ రైలు నేరుగా మీ టేబుల్ వద్దకు వచ్చి మీ ఆర్డర్ ను మీకు డెలివరీ చేసేస్తుంది.