Types of Biryanis in Hyd: బిర్యానీ బోలే తో హైదరాబాద్. నగరంలో ఎప్పుడు దొరికే దమ్ బిర్యానీతో పాటు చాలా రకాల బిర్యానీలు ఉన్నాయని మీకు తెలుసా?

హైదరాబాదులో ఎన్ని రకాల బిర్యానీలు (Types of Biryanis) దొరుకుతాయో మీకు తెలుసా? ఈ బిర్యానీలను రుచి చేశారో లేదో చెక్ చేసుకోండి.

Kerala Central Jail Biriyani, image used for representational purpose only.

నాలుక ఉన్నది నాలుగు రుచులు చూడటానికే అంటారు. ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏదో రకమైన వంటకం పాపులర్ అయి ఉంటుంది. హైదరాబాద్ (Hyderabad) అని పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది బిర్యానీ (Biryani). మరి హైదరాబాదులో ఎన్ని రకాల బిర్యానీలు (Types of Biryanis) దొరుకుతాయో మీకు తెలుసా? ఈ బిర్యానీలను రుచి చేశారో లేదో చెక్ చేసుకోండి.

1) హైదరాబాద్ దమ్ బిర్యానీ- ఈ బిర్యానీ హైదరాబాద్ లోనే కాదు, వాల్డ్ ఫేమస్. ఆనాటి నిజాం నవాబుల మెనూలో ఇది ముఖ్యమైన వంటకంగా ఉండేదని చెప్తారు. ఈ బిర్యానీ రుచి ఎప్పటికీ ఎవర్ గ్రీన్, దీనిని మించిన బిర్యానీ మరొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు, అందుకే ఇది వాల్డ్ ఫేమస్. ఇది నగరంలో చాలా చోట్ల లభిస్తుంది.

2) బిస్మిల్ల బిర్యానీ- ఇది గుంటూరు- పలనాడు స్టైల్లో తయారు చేసే బిర్యానీ. నగరంలోని ఆంధ్రా, రాయలసీమ రెస్టారెంట్లలో దొరుకుతుంది. ఇది మిగతా బిర్యానీల కంటే స్పైసీగా, పూర్తిగా డబుల్ మసాలతో ఉంటుంది.

3) ఉలవచారు బిర్యానీ - ఆంధ్రా సాంప్రదాయ వంటకాల్లో ఉలవచారు చాలా ముఖ్యమైనది. ఈ ఉలవచారు బిర్యానీ చేయటానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముందుగా ఉలవచారు చేసుకొని, దానిని చికెన్ తో కలిపి బిర్యానీ చేస్తారు.

4) అవకాయ బిర్యానీ - వేడివేడి అన్నంలో అవకాయ కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే వేడివేడి బిర్యానీకి అవకాయని జతచేసి బిర్యానీ ప్రిపేర్ చేస్తే ఆ టేస్టే వేరు. ఆంధ్రా కుసిన్ లలో ఈ బిర్యానీ పాపులర్.

5) దొన్నే బిర్యానీ: ఇది కర్ణాటకు చెందిన బిర్యానీ, నగరంలోని కొన్ని రెస్టారెంట్లలో మాత్రమే ఇది లభ్యమవుతుంది. దీనికి బాస్మతీ బియ్యం కాకుండా మామూలు బియ్యాన్నే వాడతారు. కర్ణాటకలో లభించే కొన్ని సుగంధ దినుసులతో  ఈ బిర్యానీని తయారు చేస్తారు. ఈ బిర్యానీ వాసన, రుచి అమోఘం.

6) అంబూర్ బిర్యానీ: తమిళనాడుకు చెందిన బిర్యానీ ఇది, నగరంలో తమిళ్ రెస్టారెంట్ కు ఎప్పుడైనా వెళ్తే ఈ బిర్యానీని టేస్ట్ చేయవచ్చు. ఇది కూడా బాస్మతి బియ్యంతో కాకుండా మామూలు బియ్యంతోనే చేస్తారు. టమాట కూరతో చికెన్ చేసి దానిని మళ్లీ బిర్యానీగా ఉడికిస్తారు.

7) తలసెరీ బిర్యానీ: కేరళకు చెందిన బిర్యానీ ఇది, కేరళ స్టైల్లో కూర వండి దానిని బిర్యానీలాగా వండుతారు.

8) కలకత్తా బిర్యానీ: ఈ టైప్ బిర్యానీలో మాంసంతో పాటు, ఆలుగడ్డలు ఎక్కువగా వినియోగిస్తారు. కొద్దిగా యోగర్ట్ వేసి, కొన్ని స్పైసెతో ఈ బిర్యానీని వండుతారు.

9) కళ్యాణి బిర్యానీ: నగరంలో కొన్ని చోట్ల కళ్యాణి బిర్యానీకి చాలా డిమాండ్ ఉంటుంది. ఇది ముఖ్యంగా పశుమాంసంతో తయారు చేసే బిర్యానీ.

ఇవే కాకుండా 65 బిర్యానీ, మట్కా బిర్యానీ, పచ్చి మిర్చి బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, లక్నో బిర్యానీ, బొంబాయి బిర్యానీ. కేసీఆర్ బిర్యానీ,  మోదీ ఇలా రకరకాల పేర్లతో కొత్తకొత్త బిర్యానీలను పరిచయం చేస్తూ నగరంలో ఆహార ప్రియులను ఆకర్శిస్తున్నారు.