Zika Virus: పుణెను కుదిపేస్తున్న జికా వైరస్.. ఆరు కేసులు నమోదు.. పాజిటివ్‌ జాబితాలో ఇద్దరు గర్భిణులు

వైరస్‌ వ్యాప్తితో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారినపడినవారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు.

Virus (Representative Image; Photo Credit: Pixabay)

Pune, July 2: మహారాష్ట్రలోని పూణెలో (Pune) జికా వైరస్‌ (Zika Virus) విజృంభిస్తున్నది. వైరస్‌ వ్యాప్తితో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారినపడినవారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు. ప్రస్తుతం గర్భిణుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, వైరస్‌ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా అధికారులు ఫాగింగ్‌ చేస్తున్నారు. జికా వైరస్‌ సోకిన ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్‌ దేశాలతోసహా భారత్‌, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్‌‌, థాయ్‌లాండ్‌, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది.

విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా రోదసిలోనే షికారు చేయొచ్చు. అది కూడా కేవలం రూ.200కే. మీకు కూడా ఈ అవకాశం ఉంది.. త్వరపడండి మరి!!

లక్షణాలు ఇవే..

జికా వైరస్‌ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు.

వరకట్నం పేరిట తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై.. భర్త కూడా కేసు పెట్టొచ్చు.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif