Health Tips: కేవలం 5 నిమిషాలు ఇలా వాకింగ్ చేయండి, బరువు తగ్గడం పక్కా, షాకింగ్ రిజల్ట్స్!
ఫలితంగా అనారోగ్యం బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ముఖ్యంగా కరోనా తర్వాత ఈ పరిస్థితి మరి ఎక్కువగా మారింది.
July 31: మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఉద్యోగంలో ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చోవడం కారణం ఏదైనా వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దల వరకు బరువు పెరిగిపోతూనే ఉన్నారు. ఫలితంగా అనారోగ్యం బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ముఖ్యంగా కరోనా తర్వాత ఈ పరిస్థితి మరి ఎక్కువగా మారింది.
ఇక బరువు తగ్గేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు చాలా మంది. బిజి లైఫ్ కారణంగా వ్యాయామం చేయడానికి టైం దొరకడం లేదు. అందుకే ఈజీ మార్గాలను అన్వేషిస్తూ లక్షల రూపాయల డబ్బును తగలబెడుతున్నారు. కానీ చివరికి ఫలితం మాత్రం శూన్యం.
కానీ ప్రతిరోజు కేవలం 5 నిమిషాల పాటు నడిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని సూచిస్తున్నారు. తద్వారా గుండె జబ్బులను అరికట్టవచ్చని చెబుతున్నారు. రోజూ వాకింగ్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటే తొందరగా బరువు తగ్గవచ్చు. అలాగే శరీరంలో ఆకలి హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది.
రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. అంతేగాదు నడక వల్ల ఒత్తిడి హార్మోన్ల కార్యకలాపాలు తగ్గి, మనసు, శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభిస్తుంది.ఇక ముఖ్యంగా పడుకునే ముందు ప్రతిరోజూ నడవడం మంచిదని సూచిస్తున్నారు. దీనివల్ల హాయిగా నిద్రపోవడమే కాదు శారీరకంగా ఉల్లాసంగా ఉండటంలో సాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం తగ్గేందుకు రోజూ వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు డాక్లర్లు. నడక వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. కాబట్టి ఎంత బిజీ లైఫ్‌లో ఉన్న ప్రతిరోజూ 5 నిమిషాలు నడకకు టైం కేటాయిస్తే జబ్బుల బారిన పడకుండా ఉంటామని చెబుతున్నారు. షుగర్ పేషెంట్స్ లకు అద్భుతవరం మెంతులు. ఇవి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి