Astrology: రాహు రాశి మార్పు కారణంగా..సెప్టెంబర్ 16 నుండి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
అయినప్పటికీ కూడా కొంతమంది జీవితాల్లో రాహు గ్రహం శుభ ఫలితాలను కలిగిస్తుంది. సెప్టెంబర్ 16 నుండి రాహు పూర్వ భాద్రపద రాశిలోకి సంచరిస్తాడు.
రాహు గ్రహాన్ని అందరూ మంచి గ్రహంగా పరిగణించరు. అయినప్పటికీ కూడా కొంతమంది జీవితాల్లో రాహు గ్రహం శుభ ఫలితాలను కలిగిస్తుంది. సెప్టెంబర్ 16 నుండి రాహు పూర్వ భాద్రపద రాశిలోకి సంచరిస్తాడు. దీనికి కారణంగా అన్ని రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులారాశి: రావు రాశి మార్పు కారణంగా ఈ రాశి వారికి అనేక సానుకూల ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపారస్తులు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి దేవుడు పట్ల భక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పొందుతారు ఉన్నత జ్ఞానాన్ని పొందుతారు. విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ రాశి వారు విదేశీల్లో పని చేయాలనే కోరిక నెరవేరుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు వస్తాయి. దీని ద్వారా మీ భవిష్యత్తు ఊహించనంత ఆనందంగా ఉంటుంది..
మిథున రాశి: ఈ రాశి వారికి రాహువు పూర్వాభాద్రపద నక్షత్రంలో రాశి మార్పు కారణంగా వీరి జీవితాల్లో అనేక సానుకూల ప్రయోజనాలు ఉన్నాయి. వీరికి ఊహించని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది శుభ సమయం. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. ప్రేమ వివాహాలకు అనుకూలం. మీ వివాహానికి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు కొత్తగా ఆస్తి కొనుగోలు చేయాలనుకున్నట్లయితే త్వరలోనే మీ కల నెరవేరుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్య నుండి బయటపడతారు.
Astrology: హనుమంతునికి ఇష్టమైన 4 రాశులు ఇవే
కన్యా రాశి: ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఇది మీ ఇంట్లో ఆనందాన్ని ఇస్తుంది. మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కెరియర్ పరంగా విజయం సాధించడానికి మీకు కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం చూస్తున్నవారికి మీకు జీతం పెరిగి మంచి ఉద్యోగం వస్తుంది. శుభవార్తలను అందుకుంటారు. విదేశీ కంపెనీలలో వ్యాపారానికి పెట్టుబడులు పెడతారు. ఇది విస్తరింప చేయడానికి ఇది మంచి సమయం. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు