Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా ఇలా చేస్తే మీ జుట్టు ఎప్పటికీ నల్లగా.

ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే తెల్ల జుట్టు కనిపించేది కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ తెల్ల జుట్టు సమస్య అనేది చాలా బాధిస్తుంది.

grey hair ( Image: File)

ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య తెల్ల జుట్టు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే తెల్ల జుట్టు కనిపించేది కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ తెల్ల జుట్టు సమస్య అనేది చాలా బాధిస్తుంది. ఈ తెల్ల జుట్టు వల్ల యువతలో ఆత్మనుమ్యతా భావం ఏర్పడుతుంది. కాబట్టి మార్కెట్లో దొరికే రకరకాల అయినటువంటి హెయిర్ డైలు వాడడం ద్వారా మీ సమస్య మరింత ఎక్కువగా అవుతుంది అలా కాకుండా కొన్ని నేచురల్ పద్ధతి ద్వారా మనము జుట్టును నల్లగా చేసుకోవచ్చు.

జుట్టు తెల్లగా అవ్వడానికి కారణాలు

అధిక ఒత్తిడి, పొల్యూషన్, రకరకాల అయిన షాంపూలు రకరకాలైన నూనెలు వాడడం ద్వారా ఈ సమస్య ఎక్కువ అవుతుంది. కొంత మందిలో హెరిడిటీ కారణంగా కూడా ఈ తెల్ల జుట్టు చిన్నప్పుడే వస్తుంది దీన్ని మనం తగ్గించుకోవడం కోసం ఒక ఆయిల్ ని ప్రిపేర్ చేసుకుందాం.

Health Tips: రాగిజావ తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.

దానికి కావాల్సిన పదార్థాలు.

తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడం కోసం మనము ఒక ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు గుంటగరగరాకు, కలబంద, ఉసిరి పొడి, మెంతులు ఉల్లిపాయలు గుంటగరగరాకు మనకు పొలాల్లో లభిస్తుంది. దీన్ని తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా కలబందను కూడా గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. అదే విధంగాఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలను పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. మెంతులను కూడా  దోరగా వేయించుకొని పొడిచేసుకుని పెట్టుకోవాలి. చిన్న ఉల్లిపాయలు తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకొని కలిపి కొబ్బరి నూనెలో మరిగించాలి. దాదాపు ఒక అరగంటసేపు మరిగించిన తర్వాత ఈ పదార్థాల్లో ఉండే సారమంతా కూడా ఆ నూనెకి పడుతుంది. ఇప్పుడు ఆ నూనెను వడకట్టుకొని భద్రపరుచుకోవాలి. దీన్ని మీరు తలకు అప్లై చేసుకుంటే మీ తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. అదే విధంగా కొత్తగా వచ్చే జుట్టు నలుపు జుట్టు వస్తుంది. దీన్ని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు .ఇది జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. బట్టతల సమస్య నుంచి కూడా బయట పడవేస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.



సంబంధిత వార్తలు