Bitter gourd : కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా, అయితే కాకరకాయను మించిన వైద్యం మరొకటి లేదట, ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసుకోండి...
ఇందులో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కడుపులో నులి పురుగులను నాశనం చేస్తుంది.
కాకరకాయ (Bitter Gaurd) అనగానే చేదు అంటూ చాలా మంది దీన్ని ఇష్టపడరు. కానీ కాకర ప్రయోజనాలు (Benefits of Bitter Gaurd) తెలుసుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. కాకరకాయ (Bitter Gaurd) రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి. అనేక రోగాలను నయం చేసే దివ్య ఔషధం కాకర. (Bitter Gaurd) కాకరను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కడుపులో నులి పురుగులను నాశనం చేస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి వీటిని క్రమంతప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
>> కీళ్ళ నొప్పులు తగ్గించే గుణం కాకరకాయలో ఉంది.
>> కాలేయం సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకాయకు ఉంది.
>> వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు.
>> కాకర వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు.
>> రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. కాలినగాయాలు, పుండ్లను మాన్పడంలో చక్కగా పనిచేస్తుంది.
>> అందమైన శరీరాకృతి కోరుకునే వారు, బరువు తగ్గాలనుకునేవారు చేదుగా ఉన్నా కాకరకాయ రసం తాగాల్సిందే.
>> కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి.
>> కంటి సమస్యలను తగ్గిస్తుంది.
>> ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదు.
>> శరీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది.