Hyderabad, Aug 17: ఫుడ్ సెక్యూరిటీ అధికారులు (Food Security Officials) తనిఖీలు చేసి, జరిమానాలు వేసినా, హోటల్స్ లైసెన్స్ రద్దు చేసినా మిగతా హోటల్స్ నిర్వాహకుల తీరు మారట్లేదు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నవాబ్ హోటల్ (Nawab Hotel) లో నిర్వాహకుల నిర్లక్ష్యం బయటపడింది. కోడి ఈకలు పీకకుండానే చికెన్ కర్రీ వండిన హోటల్ సిబ్బంది కస్టమర్లకు వడ్డించారు. దీన్ని పసిగట్టిన కస్టమర్లు ఇదే విషయమై హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.
ఒకవైపు ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేసిన మారని హోటల్స్ తీరు.గచ్చిబౌలిలో నవాబ్ హోటల్ బయటపడిన హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం.కోడి ఈకలు పీకకుండానే చికెన్ కర్రీ వండిన హోటల్ సిబ్బంది.ఇది ఏంటి అని అడిగిన కస్టమర్ల పైన గొడవకు దిగిన హోటల్స్ సిబ్బంది.తినకున్న బిల్లు కట్టి పోవాలంటే… pic.twitter.com/JSHqN36M0l
— ChotaNews (@ChotaNewsTelugu) August 16, 2024
కస్టమర్లపై గరం
అయితే, ఫిర్యాదు చేసిన కస్టమర్లపై హోటల్ సిబ్బంది ఎదురుతిరిగారు. ఈకలు ఉన్న చికెన్ తినకపోయినప్పటికీ బిల్లు కట్టి పోవాలని యాజమాన్యం బెదిరింపులకు దిగినట్టు కస్టమర్లు ఆరోపించారు. ఈకలతో కూడిన చికెన్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.