Wine Shops (photo-X)

వినాయక నిమజ్జనం(Vinayaka immersion) సందర్భంగా హైదరాబాద్(Hyderabad) నగరంలోని అన్ని వైన్స్(wine shop)లు రెండు రోజుల పాటు బంద్ చేయాలని.. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో లక్షల మంది ఒకే చోటకు చేరుకుంటారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించే మగాడెవడో రండి, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, తెలంగాణ తల్లిని మళ్లీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటన

గణపతి నిమజ్జనం(Vinayaka immersion) సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18 సాయంత్రం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు తెలిపారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. రేపు, ఎల్లుండి వైన్స్‌లు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయబడతాయి. కానీ స్టార్ హోటల్ బార్‌లు, రిజిస్టర్ క్లబ్‌లకు ఈ రూల్ వర్తించదని తెలిపారు.